1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు

ఆరుబయట గడిపితే పిల్లల కంటిచూపు మెరుగు

బాలప్రపంచం కథనాలు చిన్నారులు ఆరుబటయ దృష్టి లోపం ఆస్ట్రేలియా పరిశోధన మండలి అధ్యయనం ఇయాన్ మోర్గాన్
చిన్నారులు ప్రతిరోజూ ఆరుబయట గడిపినట్లయితే దృష్టి లోపం రాకుండా ఉంటుందని ఆస్ట్రేలియా పరిశోధనా మండలి అధ్యయనం ఒకటి వెల్లడించింది. రోజూ కనీసం రెండు గంటలసేపు పిల్లలు ఆరుబయట గడపటం వల్ల... వారిపై సూర్యరశ్మి పడుతుందని, తద్వారా.. వారిలో దృష్టి లోపం ఏర్పడే అవకాశాలను గణనీయంగా తగ్గించి వేస్తుందని ఆ అధ్యయనం తెలిపింది.

పై పరిశోధనలకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ... అధికంగా చదివేవారు దృష్టి సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువని అన్నారు. ఈ సమస్య వల్ల సింగపూర్‌లో 90 శాతం మంది చిన్నారులు పాఠశాల చదువు పూర్తయ్యే సమయానికి కళ్లజోళ్లు ధరిస్తున్నారని ఆయన చెప్పారు. ఇకపోతే ఆస్ట్రేలియాలో కళ్లజోళ్లు ధరించే చిన్నారుల సంఖ్య 20 శాతం మేరకు మాత్రమే ఉందని మోర్గాన్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే... కాసేపలా కళ్లజోళ్ల సంగతి పక్కనబెడితే.. చిన్నవయసు నుంచే దృష్టి సంబంధ వ్యాధుల బారిన పడుతున్న చిన్నారులు ప్రస్తుతం కోకొల్లలు. వీరిని ఆ సమస్య నుంచి గట్టెక్కించాలంటే... ప్రతిరోజూ తల్లిదండ్రులు, లేదా ఇంట్లోని పెద్దవారు పిల్లలతో ఆరుబయట గడిపేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల మీ చిన్నారుల దృష్టి లోపాన్ని సరిచేసే ప్రయత్నం చేసినవారవుతారు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి