చిన్నారి పూజజ్యోతికి ఒబామా అహ్వానం
ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని సంస్కరణలు చేపట్టినా చేనేత రంగం రోజు రోజుకూ నిర్వీర్యమైపోతోంది. ఈ సమస్య నుంచి వీరిని ఎవరూ గట్టెక్కించలేక పోయారు. దీంతో, నేతన్నల కుటుంబాలు చేసిన అప్పులు తీరక, తినేందుకు తిండిలేక... నిస్సహాయ పరిస్థితుల్లో ఆత్మహత్యల పాలవుతున్నారు.
చేనేత కార్మికుల మూకుమ్మడి ఆత్మహత్యలను చూసిన ఏ పాలకులకూ మనసు కరగకపోయినా... చిన్నారి పూజజ్యోతిని మాత్రం కదిలించి వేశాయి. చొప్పదండి గ్రామానికి వచ్చిన, పూజ పెదనాన్న ఇప్పనపల్లి సాంబయ్య ద్వారా చేనేత కార్మికుల సమస్యలను తెలుసుకున్న ఆ చిన్నారి హృదయం చలించిపోయింది. వీరి సమస్యలకు పరిష్కార మార్గం లేదా అని ఆలోచించిన ఆ చిన్నారి పూజ ఒక వెబ్‌సైట్‌ను రూపొందించింది.
అంతేగాకుండా.. లక్షమంది సంతకాలను సేకరించి నేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని శ్రీకారం చుట్టింది. ఈ రకంగా ఇప్పటికే పూజ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రుల దృష్టిని ఆకర్షించింది. అలాగే, చొప్పదండి మండలంలోని నెల రోజుల క్రితం జరిగిన "చేనేత కార్మికుల ఆత్మహత్యలు పరిష్కార మార్గాలు అనే అంశంపై వ్యాస రచన పోటీ"ని ఇప్పనపల్లి పౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి అనుహ్య స్పందన లభించింది.
ఈ నేపథ్యంలో... చిన్నతనం నుండే సామాజిక సేవా రంగంలో చూపిన సంకల్పానికి గుర్తుగా... ఆమెరికా 44వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఒబామా నుంచి చిన్నారి పూజకి ఆహ్వానం అందింది. దీంతో చొప్పదండిలోని పూజ బంధువులు, గ్రామస్థులు అమితానందాన్ని వ్యక్తం చేశారు.
పూర్తి వివరాలలోకి వస్తే... కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన ఎన్ఆర్ఐ ఇప్పనపల్లి హరికిషన్ అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటున్నారు. హరికిషన్ కూతురు పూజజ్యోతి అక్కడి విశ్వవిద్యాలయంలో పదవ తరగతి చదువుతోంది. గతంలో సొంత ఊరుకు వచ్చినప్పుడు... చేనేత కార్మికుల సమస్యలను పెదనాన్న ద్వారా విన్న ఆ చిన్నారి చలించి, తన చేతనైన సాయం చేయాలని ముందుకొచ్చింది.