టానిక్‌లతో చిన్నారులకు ప్రమాదం..!
చిన్నపిల్లలకు ఇచ్చే వివిధ రకాల టానిక్‌లు, మందులు... చిన్నారుల ఆరోగ్యానికి హాని చేస్తాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. టానిక్‌లలో ఔషధ గుణాలున్న రసాయనాలతో పాటు, టానిక్‌లకు రంగు, రుచిని అందించేందుకు కలిపే వివిధ పదార్థాలు కూడా పిల్లలకు ప్రమాదకరమని ఈ పరిశోధనల్లో తేలింది.
పై పరిశోధనలకు నేతృత్వం వహించిన భారత సంతతికి చెందిన పరిశోధకుడు హితేష్ పాండ్యా మాట్లాడుతూ... సాధారణంగా పసిపిల్లల టానిక్‌లలో ఇథనాల్, సార్బిటాల్, పోన్సియావ్ (కలరింగ్ ఏజెంట్) లాంటి రసాయనాలు ఉంటాయని తెలిపారు. ఈ పదార్థాలు చిన్నపిల్లలకు చాలా ప్రమాదకరమైనవని తమ పరిశోధనల్లో వెల్లడైందని చెప్పారు.
పెద్దవారు వారానికి 36 ఔన్స్‌ల బీరు తాగినట్లయితే... ఎలాంటి దుష్పలితాలు సంభవిస్తాయో... చిన్నారుకు ఇచ్చే టానిక్‌లలోని పదార్థాల వల్ల, వారికి కూడా అలాంటి దుష్ప్రభావాలు కలిగిస్తాయని పాండ్యా తెలియజేశారు. ఈ రసాయనాలు పిల్లల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి, ఎలాంటి ప్రభావాలు చూపుతాయన్న విషయాలను ఇంకా కనుగొనాల్సి ఉందని ఆయన అన్నారు.
అయితే... అంత మాత్రానికే తల్లిదండ్రులు అతిగా భయపడాల్సిన అవసరం లేదని పాండ్యా అంటున్నారు. నిజానికి మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా పై రసాయనాలు ఉంటాయని ఆయన వివరించారు. ఏది ఏమైనప్పటికీ... చిన్నారులకు హాని కలిగించే టానిక్‌ల వాడకాన్ని సాధ్యమైనంతగా తగ్గించటం మంచిదని, అత్యవసరమైన పరిస్థితుల్లో వైద్యుడి సలహా మేరకు పిల్లలకు ఆయా టానిక్‌లను ఇవ్వవచ్చని పాండ్యా తల్లిదండ్రులకు కాస్తంత ఊరటనిచ్చేవిధంగా పేర్కొన్నారు.