1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు

చిన్నారుల వ్యాక్సిన్లపై ప్రభుత్వ అలసత్వం

బాలప్రపంచం కథనాలు చిన్నారులు ఆరోగ్యం కేంద్రం రాష్ట్రం ప్రభుత్వం ఆశయం నిధులు వ్యాక్సిన్
చిన్నారులకు ఆరోగ్య భద్రతను అందించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. కేంద్రం తగినన్ని నిధులు కేటాయించినా, వాటిని సక్రమంగా ఉపయోగించటంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. సవ్యంగా సాగాల్సిన పిల్లల వ్యాక్సిన్ల కార్యక్రమానికి అధికారులు ఆటంకాలు సృష్టించటమేగాకుండా, వారికి అందాల్సిన వ్యాక్సిన్లను అందకుండా చేస్తున్నారు.

జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం (ఎన్ఆర్‌హెచ్ఎం) కింద ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు విడుదల చేస్తోంది. ఈ నిధులతో పిల్లలకు పోషకాహారం వ్యాక్సిన్లు, మందుబిళ్లలు అందజేయాల్సి ఉంటుంది. అలాగే మెదడువాపు సోకకుండా ఉండే వ్యాక్సిన్లను కూడా ఇవ్వాలి. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రాథమిక, పట్ణణ ఆరోగ్య కేంద్రాల ద్వారా ఈ వ్యాక్సిన్లను పిల్లలకు అందించాలి.

కేంద్రం ప్రతి ఏడాది "జీఈ వ్యాక్సిన్ (జపనీస్ ఎన్సెఫలైటిస్)" కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలలోనూ అమలు జరుపుతోంది. అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా దీనిని అమలు చేస్తున్నారు. అయితే అధికారుల అత్యుత్సాహం కారణంగా ఈ ఏడాది అమలు జరగలేదు. దేశంలో అన్ని రాష్ట్రాలలో ఇది అమలు జరిగినా మన రాష్ట్రంలో మాత్రం ఈ కార్యక్రమాన్ని పక్కనబెట్టారు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి