ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి...!
అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా తన కూతుళ్లు మాలియా, శాషాలను కట్టుదిట్టమైన జాగ్రత్తల్లోనే పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సెలబ్రిటీలను కలుసుకోరాదని మిషెల్ తన కూతుళ్లకు ఆంక్షలు విధించారు.
ఈ విషయమై అమెరికన్ వారపత్రిక ఒకటి ప్రచురించిన ఓ కథనంలో ఇలా పేర్కొంది. నలుగురిలో ప్రత్యేక గుర్తింపుతో కాకుండా, వారు సామాన్య ప్రజానీకం మాదిరిగానే సాధారణ జీవితం గడపాలని మిషెల్ కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని ఒబామా కుటుంబ స్నేహితులు వెల్లడించినట్లు ఆ పత్రిక తెలిపింది.
ఇదిలా ఉంటే... ప్రస్తుతం సిడ్వెల్ ఫ్రెండ్స్ స్కూళ్లో చదువుకుంటున్న మాలియా, శాషాలిద్దరూ కొత్త వాతావరణానికి అలవాటుపడి, అక్కడ బాగా చదువుకోవాలని మిషెల్ ఆశిస్తున్నట్లు ఆ పత్రిక కథనం పేర్కొంది. తన కూతుళ్లను బడిలో చేర్పించేందుకు వెళ్లినప్పుడు, అక్కడి పిల్లల తల్లిదండ్రులను కలిసిన మిషెల్ స్కూల్ పరిస్థితులపై మాట్లాడారని తెలిపింది. అయితే వీటిపై ఒబామాగానీ, మిషెల్ గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆ పత్రిక తెలియజేసింది.
చూశారా పిల్లలూ... ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికాకు భర్త అధ్యక్షుడిగా ఉంటున్నప్పటికీ... ఎలాంటి డాంబికాలకూ పోకుండా తన కూతుళ్లు నలుగురిలో ప్రత్యేక గుర్తింపుతో కాకుండా, సాధారణ మనుషుల్లాగే పెరగాలని కోరుకుంటున్న మిషెల్ ఒబామా మంచి తల్లిగానే కాకుండా... "ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న" సూక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు కదూ...!