ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కథనాలు > ఐఫోన్లో ప్రోగ్రాంను రూపొందించిన బుడతడు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఐఫోన్లో ప్రోగ్రాంను రూపొందించిన బుడతడు
FILE
యాపిల్ ఐఫోన్లో బొమ్మలు వేసుకునేందుకు ఉపయోగపడే ఒక ప్రోగ్రాంను సింగపూర్‌కు చెందిన తొమ్మిదేళ్ల లిమ్ డింగ్ వెన్ అనే బుడతడు రూపొందించాడు. సింగపూర్‌లో నాలుగో తరగతి చదువుతున్న ఈ చిన్నోడు, మిగతా చిన్నారులకంటే కాస్తంత ప్రత్యేకమైనవాడనే చెప్పుకోవచ్చు.

సాధారణంగా పదేళ్లలోపు వయసు పిల్లలు ఎక్కువగా క్రేయాన్లు, రంగు పెన్సిళ్లు పట్టుకుని వచ్చీరాని బొమ్మలు వేయడం మొదలు పెడుతుంటారు. కానీ... లిమ్ డింగ్ వెన్ రూపొందించిన ప్రోగ్రాం సహాయంతో టచ్ స్క్రీన్ ఐఫోన్‌పై వేళ్లు తాకిస్తూ బొమ్మలు వేసుకోవచ్చు. బొమ్మ నచ్చకపోతే చెరిపేసుకోవచ్చు.

ఐదేళ్లు, మూడేళ్లు వయసు కలిగిన చిన్నారి చిట్టి చెల్లెళ్ళు, తమ్ముళ్ల కోసమే ఈ ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌ను తయారు చేశానని లిమ్ గర్వంగా చెబుతున్నాడు. ఇదిలా ఉంటే... కేవలం రెండు వారాల వ్యవధిలోనే నాలుగు వేల మంది ఐఫోన్ యూజర్లు ఈ ప్రోగ్రాంను డౌన్‌లోడ్ చేసుకున్నారంటే.. ఈ బుడతడి అసామాన్య ప్రతిభ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

సో... పిల్లలూ లిమ్ లాగే మీరు కూడా, మీకు నచ్చిన ఏదో ఒక అంశంపై పట్టు సాధించి, అందరూ మెచ్చుకునేలాగా సరికొత్త ఆవిష్కరణలను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తారు కదూ...!
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
యూపీలో వీధి బాలలకు సంచార పాఠశాలలు
జాతీయ పురస్కారాల్లో ఆంధ్ర బాలల ఘనత
టీవీ, కంప్యూటర్ గేమ్స్‌తో మానసిక సమస్యలు
బాల్యంలో నిద్రలేమితో నిరాశ, నిస్పృహలు
నేడే జాతీయ విద్యా కమీషన్ ప్రారంభం
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి...!