ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కథనాలు > ప్రపంచంలోనే అతి తెలివైన చిన్నారి "కావెలీ"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రపంచంలోనే అతి తెలివైన చిన్నారి "కావెలీ"
FILE
అత్యంత చిన్న వయస్సులోనే ప్రపంచ పటంలో దేశాలను గుర్తించటం, దేశాధినేతల పేర్లను గడగడా చెప్పేయటం, నీటిలో ఆ మూల నుంచి, ఈమూల దాకా అలవోకగా ఈదేయటం, వాకర్ పట్టుకోవాల్సిన చేతులతో స్టీరింగ్ పట్టుకుని ఝుమ్మంటూ రోడ్లమీద డ్రైవింగ్ చేసేయటం లాంటి పనులను చేసే వండర్ కిడ్స్ గురించి అందరికీ తెలిసిందే..!

అయితే పై వారందరి కంటే వండర్ కిడ్‌గా, ప్రపంచంలోనే అత్యంత తెలివైన చిన్నారిగా అయినన్ కావెలీ అనే ఎనిమిది సంవత్సరాల అబ్బాయి రికార్డు సృష్టించాడు. సింగపూర్‌లో తల్లిదండ్రులతో నివాసం ఉంటుండే ఇతడు, అక్కడి కాలేజీలో కెమిస్ట్రీ విద్యను అభ్యసిస్తున్నాడు.

ఏంటీ ఎనిమిది సంవత్సరాలకే కాలేజీలో చదువుతున్నాడా..? అని అంటారేమో..? అవును ఇదే కావెలీ ప్రత్యేకత మరి.. ఈ చిచ్చర పిడుగు ఏడు సంవత్సరాల వయస్సుకే జిసిఎస్ఇ పాసయ్యాడు. నిజం చెప్పాలంటే, కావెలీ ఎనిమిది నెలల వయసు నుంచే చదవడం ప్రారంభించాడు.

లెక్కలంటే పెద్దవాళ్లు సైతం గాభరా పడటం సహజం. కానీ కావెలీకి మాత్రం కొట్టిన పిండి. గుండె పీరియాడిక్ టేబుల్ గురించి గడగడా చెప్పేస్తాడు. తన వయస్సు పిల్లలతో కలిసి ఆడుకుంటాడు. వయసులో చిన్నవాడైనప్పటికీ, విషయాలను అర్థం చేసుకోవడంలో మాత్రం పెద్దవారికంటే ముందుంటాడు కాబట్టే, కావెలీ వరల్డ్ వండర్ కిడ్ కాగలిగాడు.

కొడుకు ఘనత గురించి మురిసిపోతున్నకావెలీ తండ్రి వాలెంటైన్ కావెలీ మాట్లాడుతూ... ముఖ్యంగా సైన్స్ విషయంలో తమ కుమారుడు చాలా ఫాస్ట్ అని, కెమిస్ట్రీ ఫార్మూలాలు అన్నింటినీ టకటకా చెప్పేస్తాడని సంతోషంగా వెల్లడించాడు. అన్నట్టు.. ప్రపంచంలోనే అతి తెలివైన చిన్నారి బాలుడిగా అయినన్ కావెలీ మీద ఓ డాక్యుమెంటరీని కూడా రూపొందించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
"స్లమ్‌డాగ్" బాలనటులకు అన్యాయం
రాయపల్లి వంశీకి "సాహస బాలుడు" అవార్డు
చైనా బొమ్మలపై కేంద్రం నిషేధం
టానిక్‌లతో చిన్నారులకు ప్రమాదం..!
చిన్నారి పూజజ్యోతికి ఒబామా అహ్వానం
గర్భస్థ శిశువులూ పాఠాలు నేర్చుకుంటాయట!