ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కథనాలు > ఏడో ఏటనే సుష్మా లిమ్కా రికార్డు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఏడో ఏటనే సుష్మా లిమ్కా రికార్డు
FILE
ఏడు సంవత్సరాల వయసులోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు నిర్వహించిన పదవతరగతి పరీక్ష పాసైన సుష్మా వర్మ అనే బాలిక "లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్"లో స్థానం సంపాదించింది.

ఈ విషయమై లక్నోలోని సెయింట్ మీరాస్ ఇంటర్ కాలేజీ అధికారులు మాట్లాడుతూ... తమ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని అయిన సుష్మా వర్మ ఏడు సంవత్సరాల మూడు నెలల 28 రోజుల వయసులో హైస్కూలు పరీక్షలో ఉత్తీర్ణురాలైందని వెల్లడించారు. ఇలా పరీక్ష పాసైన అతి చిన్న వయస్కురాలిగా సుష్మా లిమ్కా రికార్డుల్లోకెక్కిందని వారు తెలిపారు.

కాలేజీ అధికారులు పంపించిన నామినేషన్ ప్రాతిపదికగా... లిమ్కా రికార్డుల బుక్ సుష్మాకు సర్టిఫికెట్‌ను అందజేసింది. కాగా, ఇదే పరీక్షలో రెండు సంవత్సరాల క్రితం.. ఉత్తీర్ణురాలైన తొమ్మిదేళ్ల బీహార్ విద్యార్థిని తథాగత్ తులసి రికార్డును సుష్మా బద్ధలుకొట్టి, తాజా రికార్డును నమోదు చేసింది.

రికార్డులో స్థానం సంపాదించిన అనంతరం సుష్మా మాట్లాడుతూ... తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్నేహితుల సహకారంతోనే తానీ ఘనతను సాధించినట్లు పేర్కొంది. కాగా, సుష్మా వర్మ ఘనతను ఇప్పటికే జపాన్‌లోని టోక్యో బ్రాడ్‌కాస్టింగ్ కార్పోరేషన్ గుర్తించి... ఇలాంటి ఘనతను సాధించిన చిన్నారుల జాబితాలో పొందుపరిచారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
బాల్యంలో వేధిస్తే.. పెద్దయ్యాక ఆత్మహత్యలు..!
"స్మైల్ పింకీ' చిన్నారికి స్కాలర్‌షిప్
"స్లమ్‌డాగ్" చిన్నారులకు ఆస్కార్ ఆహ్వానం
సీబీఎస్‌సీ లఘు చిత్రం "స్మైల్ యువర్ వే త్రూ"
ప్రపంచంలోనే అతి తెలివైన చిన్నారి "కావెలీ"
ఐఫోన్లో ప్రోగ్రాంను రూపొందించిన బుడతడు