ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కథనాలు > "స్మైల్ పింకీ" కల నెరవేరబోతోంది
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"స్మైల్ పింకీ" కల నెరవేరబోతోంది
FILE
ఆస్కార్ అవార్డు పొందిన "స్మైల్ పింకీ" అనే డాక్యుమెంటరీ చిత్రంలో ప్రధాన పాత్రధారిణి అయిన పింకీ కల ఎట్టకేలకు నెరవేరబోతోంది. ఎప్పటికైనా వైద్య విద్య చదివి తనలాగే గ్రహణం మొర్రితో బాధపడే చిన్నారులకు వైద్యసేవలు అందించాలన్నది ఆమె కల.

వారణాసిలోని లాల్‌బహదూర్ శాస్త్రి విమానాశ్రయంలో పింకీకి స్వాగతం చెప్పేందుకు వచ్చిన భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి అజయ్‌రాయ్, తన స్నేహితుడు డాక్టర్ వినోద్ భండారీ తరపున ఈ మేరకు ఓ హామీనిచ్చారు. అదేంటంటే... ఇండోర్‌లోని భండారీకి చెందిన "అరవిందో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్"లో పింకీకి ఉచితంగా వైద్య విద్యను అందిస్తామని...!

ఇదిలా ఉంటే... పింకీ ప్రాథమిక విద్య కోసం వినోద్ తల్లి, ఉపాధ్యాయురాలు ఉషా భండారీ తన ఫించన్ సొమ్ము మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఈ సందర్భంగా పింకీ తండ్రి మాడ్లాడుతూ... డాక్టర్ కావాలన్న తన కుమార్తె కల నెరవేరబోతున్నందుకు సంతోషంగా ఉందనీ, ఆమె కలను సాకారం చేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని గద్గద స్వరంతో వెల్లడించారు.

"ఒకప్పుడు తన కూతురు అమెరికా వెళ్లాలని అనుకునేదనీ, ఇప్పుడామె కల నెరవేరిందనీ... వైద్యురాలినై తనలాంటి పిల్లలందరికీ సేవ చేస్తానని తన కూతురు అంటోందంటే... ఇదంతా భండారీగారి పుణ్యమేననీ.." పింకీ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
పాఠశాలల్లో సెల్‌ఫోన్ల నిషేధం..?
ఏడో ఏటనే సుష్మా లిమ్కా రికార్డు
బాల్యంలో వేధిస్తే.. పెద్దయ్యాక ఆత్మహత్యలు..!
"స్మైల్ పింకీ' చిన్నారికి స్కాలర్‌షిప్
"స్లమ్‌డాగ్" చిన్నారులకు ఆస్కార్ ఆహ్వానం
సీబీఎస్‌సీ లఘు చిత్రం "స్మైల్ యువర్ వే త్రూ"