ప్రధాన పేజి > ఇతరాలు > బాలప్రపంచం > కథనాలు > రోజువారీ ప్రణాళికతో పాఠ్యాంశాల పూర్తి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రోజువారీ ప్రణాళికతో పాఠ్యాంశాల పూర్తి
సబ్జెక్టుల ప్రకారంగా కేలండర్
FILE
అనారోగ్యం కారణంగా కానీ, మరే ఇతర కారణాల వల్లగానీ స్కూలుకు వెళ్లలేని చిన్నారులు.. వెంటనే మీ స్నేహితులను అడిగి నోట్స్ తీసుకుని ఆయా పాఠాలను రాసుకోవాలి. అందులో ఏవేని సందేహాలు వచ్చినట్లయితే టీచర్‌ను అడిగి తెలుసుకోవాలి. పరీక్షలు దగ్గరపడిన తరువాత ఎవరూ నోట్స్ ఇవ్వరు కాబట్టి, వెంటనే అలాంటి పెండింగ్ పనులేవైనా ఉంటే పూర్తి చేసుకోవడం మంచిది.

పిల్లలూ మీ సబ్జెక్టుల ప్రకారం రోజులను కేటాయించుకుని ఒక కేలండర్‌ను తయారు చేసుకోవాలి. ఈ గంటలో ఈ చాప్టర్ పూర్తి చేయాలి అనుకున్నట్లయితే, అప్పుడు దానిని పూర్తి చేసేందుకే ప్రయత్నించాలి. చదువుతున్న సబ్జెక్ట్ బోర్‌గా అనిపించటం, చదివింది బుర్రకెక్కడం లేదు అనిపిస్తే.. వెంటనే రిలాక్స్ అయ్యేందుకు ప్రయత్నం చేయకుండా ఉండాలి.

అలాంటి సమయాల్లో మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇష్టంగా ఉంటుందో దాన్ని తీసుకుని చదవడం ప్రారంభిస్తే, ఉత్సాహం దానంతటదే వచ్చేస్తుంది. సమయమూ వృధా కాకుండా ఉంటుంది. అంతేగాకుండా, ఏదో ఒక చాప్టర్‌ను పూర్తి చేసినట్లు కూడా అవుతుంది.

పిల్లలూ... కష్టంగా అనిపించే సబ్జెక్టులను అదే పనిగా.. దానికి కేటాయించిన రోజుల్లోనే చదవాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి ఆ సబ్జెక్టులను చాప్టర్లుగా విభజించుకుని రోజుకొక చాప్టర్‌ను పూర్తి చేయాలి. కేలండర్ ప్రకారం ఆ రోజు చదవాల్సిన సబ్జెక్టును పూర్తి చేస్తూనే మరికొంత సమయం వీటి కోసం అడ్జస్టు చేసుకున్నట్లు అవుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రియాల్టీ షోలతో బాల్యం బలి
పరీక్షల్లో కాపీ కొడుతుంటే పట్టుకున్నారనీ..!
ఎరేజ్-ఎక్స్‌తో పిల్లల ఆరోగ్యానికి ముప్పు
బడికెళ్లని "స్లమ్ డాగ్" బాలనటులు
"పిట్ట కొంచెం.. కూత ఘనం" అనిపించిన ప్రణవ్
కైరో ఫిలిం ఫెస్టివల్‌లో "ఘటోత్కచుడు"