1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు
  6. articles

చేపలతో టీనేజ్ పిల్లల్లో తెలివితేటలు

బాలప్రపంచం
టీనేజ్ వయస్సులో ఉన్న పిల్లలు క్రమం తప్పకుండా చేపలు తిన్నట్లయితే... తెలివితేటలు అమాంతం పెరిగిపోతాయని ఒక స్వీడిష్ పరిశోధనలో వెల్లడైంది. వారానికి ఒకసారికంటే ఎక్కువగా చేపలను ఆహారంలో తీసుకున్నట్లయితే... చూపు, చదువుకు సంబంధించిన విషయాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారని పరిశోధకులు అంటున్నారు.

ఈ విషయమై పశ్చిమ స్వీడన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ గోతెన్‌బర్గ్ ప్రొఫెసర్ జేల్ టొరేన్ మాట్లాడుతూ... తమ పరిశోధనల్లో భాగంగా... 3,972 మందిని, మూడు సంవత్సరాలపాటు పరిశీలించి పై నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. కాగా, ఈ పరిశోధనలకు సంబంధించిన వివరాలతో కూడిన వ్యాసం "ఆక్టా పిడియాట్రికా" అనే పత్రికలో ప్రచురితమయ్యింది.

చేపలు తక్కువ తినేవారికి, ఎక్కువగా తినేవారికీ మధ్య ఉండే స్పష్టమైన తేడాను తమ పరిశోధనల్లో గమనించినట్లు పరిశోధకులు వివరించారు. చేపలు తినేవారిలో మిగిలిన వారికంటే చూపు, చదువుకు సంబంధించిన తేడాలు ఆరుశాతం ఎక్కువ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని వారు తెలిపారు. ఎక్కువగా చేపలను ఆహారంలో తీసుకునే టీనేజ్ పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండటాన్ని తాము గమనించామన్నారు.

ముఖ్యంగా... 15 సంవత్సరాల వయస్సున్న బాలురు వారానికి ఒకసారైనా చేపలు తింటే, 18 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి వారి తెలివితేటలు బాగా పెరుగుతాయని పరిశోధకులు చెప్పారు. అయితే, తెలివితేటలు, చేపలు తినడం అనే ఈ రెండు విషయాల మధ్య సంబంధాన్ని మాత్రం తమ పరిశోధకులు కనుక్కోలేకపోయారని జేల్ టొరేన్ పేర్కొన్నారు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి