Kids world | articles | july | full eclipse | mumbai | surat | baroda | సంపూర్ణ సూర్యగ్రహణం... మళ్లీ 123 ఏళ్ల తర్వాతే...!!
జూలై నెల 22వ తేదీ, బుధవారం రోజున సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. 6 నిముషాల 39 సెక్లనపాటు ఉండే ఈ గ్రహణం ప్రపంచంలోని పలు దేశాలలో స్పష్టంగా కనిపించనుంది. అన్నట్టు... మళ్లీ ఇంతటి సుదీర్ఘమైన సూర్యగ్రహణం మళ్లీ 2132, జూన్ 22వ తేదీన సంభవించనుందట. అంటే ఇంకో 123 సంవత్సరాలపాటు వేచి చూడాల్సిందే...!!
అదలా ఉంచితే... బుధవారం సంభవించబోయే సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలోని ముంబైకి ఉత్తరాన ఉండే ఖంభట్ అఖాతంపైనుంచి కనిపించటం మొదలై క్రమంగా తూర్పు భారతం మీదకు సాగుతుంది. సూరత్, బరోడా, వారణాశి, పాట్నా, దీనాజ్‌పూర్ ప్రజలు గ్రహణాన్ని సంపూర్ణంగా వీక్షించవచ్చు. ఈ నగరాలకు ఎగువన, దిగువన ఉండే నగరాల్లోని ప్రజలు 20 నుంచి 80 శాతం వరకు గ్రహణ ప్రభావాన్ని చూడవచ్చు.
అయితే చైనాలోని షాంఘై నగరంలో గరిష్టంగా 5 నిమిషాల 30 సెకన్లపాటు ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనుంది. మన దేశంలో బీహార్‌లోని తెరెగణాలో 3 నిమిషాల 48 సెకన్లపాటు గ్రహణం కనిపిస్తుంది. అలాగే మన దేశం తరువాత నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్, చైనా దేశాలలో కనిపించనుంది.
అయితే భూమిపై ఒకేసారి ఇంతసేపు చంద్రుడి, సూర్యుడి ఆకర్ణణా శక్తి పనిచేయడంతో భూ వాతావరణంలో మార్పులు వస్తాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా సునామీలు, భూకంపాలు కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదని ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మన పూర్వుల కాలంలో చెప్పుకోదగ్గ గ్రహణాలు ఏవంటే... మహాభారత కాలంలో మూడు సంపూర్ణ సూర్యగ్రహణాలు ఏర్పడ్డాయట. కురుక్షేత్ర యుద్ధం సందర్భంగా అర్జునుడికి సహకరించే లక్ష్యంతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో సూర్య కిరణాలను అడ్డుకుని యుద్ధభూమిని చీకటిగా మార్చేశాడట. ఇదే విషయాన్ని "అక్బర్ నామా"ను రాసిన అబుల్‌ఫజల్ పేర్కొనడం గమనార్హం.
అలాగే... 1762 అక్టోబర్ 17వ తేదీన శిక్కులకు, ఆఫ్ఘాన్ వీరుడు అహ్మద్ షా కు మధ్య యుద్ధం జరుగుతుండగా గ్రహణం ఏర్పడటంతో పట్టపగలే చుక్కలు కనిపించటంతో ఇరుపక్షాలూ యుద్ధాన్ని ఆపివేశాయట... అదండి పిల్లలు పురాణ కాలంలో ఏర్పడిన సూర్యగ్రహణాల సంగతి.
ఇక సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే... మళ్లీ ఎన్నాళ్లకోగానీ ఇలాంటి అవకాశం రాదనుకుంటూ, గ్రహణాన్ని నేరుగా చూసే ప్రయత్నం చేయకూడదు. కళ్లతో నేరుగానూ, కెమెరాలు, టెలస్కోప్‌లు, బైనాక్యులర్లతో గ్రహణాన్ని చూసినట్లయితే కంటిచూపు పోయే ప్రమాదం ఉంది కాబట్టి, అలా చేయకూడదు.
ఫిల్టర్ గ్లాసులు ఉపయోగించి గ్రహణాన్ని చూసినట్లయితే కళ్లకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇకపోతే... గ్రహణం సమయంలో భయపడి వ్యాపార సంస్థలను మూసివేయాల్సిన అవసరం లేదు, ప్రయాణాలను మానుకోవాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

| |