1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు
  6. children

చిన్నారులకు శాపం... పౌష్ఠికాహార లోపం

భారతదేశం
WD
"మన ఆర్థిక స్థితి మరీ అంత ప్రమాదకరంగా ఏమీ లేదు. మెరుగ్గానే ఉంది. మాంద్యం మనల్ని మరీ అంత కుంగదీయడం లేద"ని నేతలు చెపుతున్నప్పటికీ మూడేళ్లలోపు చిన్నారులు పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్నారు.

మూడేళ్లు.. అంతకంటే తక్కువ వయసున్న పిల్లల్లో సుమారు 46 శాతం మంది ఈ సమస్యతో సతమతమవుతున్నట్లు ఇంగ్లండుకు చెందిన ఓ సంస్థ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ సమస్య ఇలాగే కొనసాగితే ప్రపంచంలో పౌష్ఠికాహార లోపంతో బాధపడే చిన్నారులు గల దేశాల జాబితాలో మనదేశం తృతీయ స్థానాన్ని ఆక్రమించడం ఖాయమని ఆ సంస్థ తెలిపింది.

పౌష్ఠికాహార లోపం వల్ల చిన్నపిల్లల్లో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వారిలో పెరుగుదల ఆగిపోతుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోయి తరచుగా అనారోగ్యానికి గురవుతారు. ఇక చదువు, ఇతర విషయాల్లోనూ పూర్తిగా వెనుకబడిపోతారు. మొత్తంగా వారి జీవితం దినదినగండంగా మారుతుంది.

మనదేశంలో చిన్నపిల్లల ఆహార నియమాలపై తల్లిదండ్రులు పెద్దగా శ్రద్ధ చూపించకపోవడం కూడా మరో కారణంగా ఉన్నట్లు సంస్థ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఏదేమైనా చిన్నారుల పౌష్ఠికాహార సమస్య మరింత తీవ్రరూపం దాల్చక ముందే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ హెచ్చరించింది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు- Webdunia Telugu సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి