కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథనాలు » "కామిక్ బుక్‌"లో సూత్రదారుడిగా ఆంజనేయుడు (Kids World, Anjaneya, Where Is Hanuman, California, Chris Woods, Benjamin Mcclintic,)
 
Hanumaan
FILE
భక్తికి, శక్తికి, పవిత్రతకు, నమ్మకానికి మారుపేరైన రామభక్తుడు ఆంజనేయుడు కొత్తగా మరో అవతారంలో కనిపించనున్నాడు. కాలిఫోర్నియాకు చెందిన ఓ రచయిత తాను చిన్నపిల్లల కోసం రాసిన "వేర్ ఈజ్ హనుమాన్" అనే పుస్తకంలో ఆంజనేయుడు సూత్రదారుడిగా చిన్నారుల్ని అలరించనున్నాడు.

క్రిస్ ఉడ్స్, బెన్ మెక్ క్లింటిక్‌లు రాసిన ఈ వేర్ ఈజ్ హనుమాన్ పుస్తకాన్ని భారతదేశంలో "పెంగ్విన్-బుక్స్ ఇండియా" అనే సంస్థ ముద్రించనుంది. దీనిని గుర్గావ్‌లోని 'రిలయన్స్ టైమ్ అవుట్ స్టోర్'లో ప్రారంభించారు. కాగా ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లల తల్లిదండ్రులు, ప్రముఖులు మాట్లాడుతూ... వేర్ ఈజ్ హనుమాన్ పుస్తకంలోని కథలో ఆంజనేయుడే ప్రధాన పాత్రధారి అని అన్నారు. ఈ కథలోని పాత్రలతో పిల్లలు తమనుతాము పోల్చుకుంటారనీ, రామాయణంలోని ఆంజనేయుడి పాత్రకు.. ఈ పుస్తకంలోని ఆంజనేయుడి పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆంజనేయుడి పాత్ర చిత్రీకరణ పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటుందనీ, ఆంజనేయుడిని పరిచయం చేస్తూ ప్రారంభం అయ్యే కథలో ఆంజనేయుడితోపాటు కొన్ని జంతువులు, మరికొంతమంది మనుషులు ప్రయాణం సాగిస్తారనీ.. పిల్లల ఊహలకు దగ్గరగా పాత్రల చిత్రీకరణ జరిగిందని పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు ప్రశంసించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.