ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథనాలు » పసిపిల్లల మరణాలు భారత్‌లోనే అధికం..! (Kids World | Articles | Chidss | India | First Place | Save the Children | NGO | Shireen Miller)
పసిపిల్లలు, ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు మృతి చెందుతున్న దేశాలలో భారతదేశం అగ్రభాగంలో నిలుస్తోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. వీరిలో పుట్టిన 24 గంటలలోపు మరణిస్తున్న పిల్లల సంఖ్య 4 లక్షలు కాగా.. పుట్టిన తొలి నెలలోనే మృత్యువాత పడుతున్నవారి సంఖ్య పది లక్షల దాకా ఉంటోందని ఈ అధ్యయనం చెబుతోంది.
"సేవ్ ద చిల్డ్రన్" అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ పూర్తి స్థాయిలో అధ్యయనం జరిపి పై విధంగా వివరాలను అందించింది. దీని ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా పసిపిల్లల మొత్తం మరణాల సంఖ్య 90 లక్షలు కాగా... ఒక్క మన దేశంలోనే ప్రతి ఏటా 20 లక్షల మంది చిన్నారులు మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన షిరీన్ మిల్లర్ మాట్లాడుతూ... అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. అవి సామాన్య పౌరులకు ఆమడదూరంలో ఉండటం మూలంగానే.. భారత్‌లో పిల్లల మరణాలకు కారణంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. ఇక, సంపన్న నగరమైన ఢిల్లీలో ఫ్లైఓవర్ల కింద ప్రసవిస్తున్న తల్లుల సంఖ్య కూడా లెక్కకు మించ ఉందని మిల్లర్ ఆవేదన వ్యక్తం చేశారు.
పేదలకు ఆరోగ్య సేవలను అందించటంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలం చెందిన కారణంగానే పసిపిల్లల మరణాలు సంభవిస్తున్నాయని మిల్లర్ పేర్కొన్నారు. పోషకాహార లోపం, నియో నాటల్ వ్యాధులు, డయేరియా, న్యూమోనియాలు ఈ మరణాలకు కారణాలుగా నిలుస్తున్నాయని ఈ అధ్యయనం ద్వారా స్పష్టమైనట్లు మిల్లర్ తెలిపారు. ఇదిలా ఉంటే.. అత్యధిక జనాభా కలిగిన చైనా పసిపిల్లల మరణాల్లో ఐదో స్థానంలో గమనార్హం.