1. ఇతరాలు
  2. »
  3. బాలప్రపంచం
  4. »
  5. కథనాలు
  6. Hugs

Articles | Hugs | Childs | South Australia | Primary School | Senior Grade Students | Largs Bay Primary | చిన్న పిల్లలూ.. కౌగిలింతలొద్దు సుమా...!!

కథనాలు
FILE
కౌగిలింతలతో చిన్నపిల్లలు పాడైపోయే అవకాశం ఉంది కాబట్టి.. పాఠశాలల్లో పిల్లలు కౌగిలించుకోరాదంటూ దక్షిణ ఆస్ట్రేలియాలోని ప్రాథమిక పాఠశాల ఒకటి నిషేధం విధించింది. ఆరు లేదా ఏడు సంవత్సరాల వయసున్న బాలబాలికలు కౌగిలింతలతో పాడవుతారని ఈ పాఠశాల పిల్లల కౌగిలింతలపై నిషేధం విధించింది.

సీనియర్ గ్రేడ్ విద్యార్థులు తమ స్నేహితులను కౌగిలించుకోవటంతోపాటు అభిమానాన్ని వ్యక్తపరిచే ఇతర పద్ధతులపై లార్జ్స్ బే ప్రైమరీ స్కూల్ నిషేధం విధించినట్లు "హెరాల్డ్ సన్" పత్రిక ఓ కథనాన్ని వెల్లడించింది. ఆరేడేళ్ల పిల్లలు ఆప్యాయంగా కౌగిలించుకుంటే వారికంటే చిన్నవారైన పిల్లలు వారిని చూసి చెడిపోతారని సదరు పాఠశాల వాపోతోంది.

ఈ విషయమై లార్జ్స్ బే ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ జూలీ గైల్ మాట్లాడుతూ... స్నేహితుల మధ్య కౌగిలింతలను నిషేధించలేదనీ.. అయితే వారి అభిమానాన్ని స్కూల్లో ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదన్నారు. అలా కౌగిలించుకునే ఆరేడేళ్ల పిల్లల్ని చూసి వారికంటే చిన్నగా ఉండే పిల్లలు సైతం అలాంటి అలవాట్లను అలవర్చుకుంటారనీ, అది వారికి భవిష్యత్తులో ఇబ్బందిగా తయారవుతుందని గైల్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. పాఠశాల నిషేధం గూర్చి విన్న విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. పిల్లలు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే చర్య తీసుకోవాలే తప్ప, ఇలా మొత్తంగా నిషేధించటం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి అసాధారణ క్రమశిక్షణా పద్ధతులకు గురిచేసే పాఠశాలల్లపిల్లల్ని చదివించేందుకు తాను సుతారామూ అంగీకరించబోనంటూ ఈ నిషేదంపై ఓ తల్లి వ్యాఖ్యానించటమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి