ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథనాలు » తల్లి వృద్ధాప్య లక్షణాలు.. పిల్లల్లోనూ కనిపిస్తాయట..! (Article | Skin | Wrinkles | Mother | Kids | London | Loma Linda University | Scientists | Doctor Matthew)
తల్లి వృద్ధాప్య లక్షణాలు.. పిల్లల్లోనూ కనిపిస్తాయట..!
FILE
వయసు మీద పడుతున్నకొద్దీ కళ్లకింద చారలు ఏర్పడటం, చర్మం సాగే గుణం కోల్పోవటం, ముడతలు పడటం లాంటి మార్పులు అందరికీ తెలిసిందే. అయితే తల్లుల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో.. వారికి పుట్టే పిల్లల్లో కూడా వయసు మీదపడే కొద్దీ అలాంటి మార్పులే చోటు చేసుకుంటాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
వివరాల్లోకి వస్తే.. లండన్‌లోని లోమా లిండా యూనివర్శిటీ పరిశోధకులు వృద్ధాప్య లక్షణాలకు సంబంధించి పరిశోధనలు చేశారు. ఇందులో భాగంగా వీరు చాలా దగ్గర పోలికలు ఉండే తల్లీకూతుళ్లను పరిశోధనకు ఎంపిక చేసుకున్నారు. వీరిలో 15 నుంచి 90 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు ఉన్నారు.
ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ మాథ్యూ క్యాంప్ మాట్లాడుతూ... పరిశోధనకు ఎంపిక చేసుకున్న తల్లీ కూతుళ్లందరి ముఖ చిత్రాలను త్రీడీ మోడలింగ్ ద్వారా రూపొందించి పరిశోధకులు పరిశీలించినట్లు తెలిపారు. ఈ అధ్యయనం ద్వారా.. తల్లుల్లో ఎలాంటి వృద్ధాప్య ఛాయలు కనిపించాయో, వారి పిల్లల్లోనూ అదే రీతిలో చర్మం ముడుతలు, సాగిపోవటం లాంటి లక్షణాలను గుర్తించినట్లు క్యాంప్ వివరించారు.
పిల్లలకు 30 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈ లక్షణాలను మరింత స్పష్టంగా గుర్తించవచ్చునని మాథ్యూ క్యాంప్ వివరించారు. కాబట్టి.. ముసలితనం వచ్చాక తాము ఎలా ఉంటామో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న పిల్లలు, వారి తల్లులను గమనిస్తూ ఉంటే సరిపోతుంది కదూ..?