క్లిష్టమైన హృద్రోగాలతో బాధపడే చిన్నారుల పాలిట మియాట్ ఆస్పత్రి ఆపద్భాంధవ పాత్రను పోషిస్తోంది. పలు క్లిష్టతరమైన హృద్రోగ శస్త్రచికిత్సలను విజయంవంతంగా నిర్వహిస్తూ ఎంతోమందికి పునర్జన్మను ప్రసాదిస్తోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశంలో పేరొందిన ఆస్పత్రులు సైతం నిర్వహించలేని అత్యంత క్లిష్టతరమైన హృద్రోగ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి ఎంతోమంది చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపుతోంది.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్ శివారు ప్రాంతమైన మనప్పాక్కంలో ఉన్న మియాట్ ఆస్పత్రి ప్రాంగంణంలో చిల్డ్రన్స్ వేడుకలు శుక్రవారం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా హృద్రోగ శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తిచేసిన చిన్నారులు పాల్గొని తమ అభిప్రాయలను, మనోభావాలను, వెల్లడించారు.
ఆపరేషన్‌కు ముందు.. ఆపరేషన్ తర్వాత తమ ఇబ్బందులను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆస్పత్రి ఛైర్‌పర్సన్ మల్లికా మోహన్‌దాస్ మీడియాతో మాట్లాడుతూ... తమ ఆస్పత్రిలో 2007 సంవత్సరం మార్చిలో మియాట్ సెంటర్ ఫర్ చిల్డ్రన్స్ కార్డియాక్ కేర్ సెంటర్‌ను ప్రారంభించినట్టు చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 1000 శస్త్ర చికిత్సలు చేసినట్టు తెలిపారు. తాజా జనాభా లెక్కల ప్రకారం దేశంలో రెండు మిలియన్ల మంది హృద్రోగంతో బాధపడుతున్నట్టు ఆమె తెలిపారు.
ఇందులో 630 కార్డియాక్ సర్జరీలు కాగా, 480 పిన్ హోల్ సర్జరీలు అని ఆమె వివరించారు. అలాగే 197 ఆపరేషన్లను "ఇలం సీరర్
Srini
WD
ఇరుదయ పాదుగాప్పు దిట్టమ్" కింద చేసినట్టు ఆమె తెలిపారు. ఈ పథకం కోసం తమిళనాడు ప్రభుత్వం ఒక కార్పొరేట్ ఆస్పత్రితో తొలిసారి భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
గత రెండు సంవత్సరాల్లో ఈ పథకం కింద సుమారు 200 ఆపరేషన్లు పూర్తి చేసినట్టు ఆమె తెలిపారు. ఆ తర్వాత 2007 సెప్టెంబరు చిల్డ్రన్స్ ఇంటర్నేషనల్ మియాట్ ఆస్పత్రి (సీహెచ్ఐఎంఈ) అనే కొత్త ట్రస్టును ప్రారంభించామని తెలిపారు. ఈ ట్రస్టు కింద గత రెండు సంవత్సరాల్లో 300 ఆపరేషన్లు పూర్తి చేసినట్టు మల్లికా మోహన్‌దాస్ తెలిపారు.
ఆ తర్వాత చెన్నయ్ ఎగ్మూరు హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ కార్డియో థొరాసిక్ సర్జరీ హెచ్ఓడీ డాక్టర్ పి.మూర్తి మాట్లాడుతూ.. ప్రతి యేడాది 2.5 లక్షల మంది హృద్రోగం బారిన పడుతున్నట్టు చెప్పారు. పుట్టే ప్రతి వంద మందిలో ఒకరికి ఈ వ్యాధి ఉందున్నారు. అలాగే, ప్రతి మూడు నిమిషాలకు ఒకరి హృద్రోగంతో మృత్యువాత పడుతున్నట్టు చెప్పారు. ఈ ప్రకారం.. ప్రతి యేడాది 80 వేల వివిధ రకాల గుండె జబ్బు వ్యాధులతో తిరిగిరాని లోకాలకు చేరుకుంటున్నట్టు చెప్పారు.
హృద్రోగంతో పుట్టే చిన్నారులు యేడాదిలోపే చనిపోతున్నట్టు తెలిపారు. వీటికి ప్రధాన కారణం.. మేనరిక సంబంధాలు, జన్యు సంబంధిత లోపాలు, గర్భ సమయంలో వాడే మందుల వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్, ఎన్విరాన్‌మెంటల్ తదితర అంశాల వల్ల పుట్టుకతోనే హృద్రోగ వ్యాధులతో జన్మిస్తున్నట్టు ఆయన అభిప్రాయపడ్డారు.
అందువల్లే తాము రాష్ట్ర ప్రభుత్వానికి మరోకొత్త సిఫార్సు చేసినట్టు ఆయన తెలిపారు. ఈ పథకం ప్రకారం ఆరు నెలల గర్భ సమయం నుంచి రెండు సంవత్సరాల వరకు బీమా సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం కల్పించాలని కోరినట్టు తెలిపారు.
అంతకుముందు.. హృద్రోగంతో బాధపడుతూ.. మియాట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఆరోగ్యంగా ఉన్న చిన్నారులతో డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివకుమార్, డాక్టర్ రాబర్ట్, డోనర్, జీన్ కందస్వామి తదితరులు పాల్గొన్నారు.