కథలు | జనరల్ నాలెడ్జ్ | జోకులు | కవితలు | కథనాలు | చైల్డ్ కేర్ | అమరచిత్ర కథలు
ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథనాలు » భయమెరుగని చిన్నారులు పెద్దయితే.. నేరగాళ్లే...! (Articles | Fear | Childrens | Three Years | Bathroom | Court | Scientist | America | Care | Exercise)
Feedback Print Bookmark and Share
 
Kid
FILE
"రాత్రుళ్లు మా పిల్లలకు అస్సలు భయం అనేదే ఉండదు తెలుసా..? ఏ సమయంలోనయినా వాళ్లంతట వాళ్లే లేచి బాత్‌రూమ్‌కు వెళ్లి వస్తుంటార"నీ సంబరపడిపోయే తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త పడాల్సిందే...! పిల్లలకు భయం లేకపోవటం సంతోషమే అయినా.. అలాంటి పిల్లలు పెద్దయ్యాక నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడిస్తోంది.

మూడేళ్ల వయసులో ఉండాల్సిన కొద్దిపాటు జంకు కూడా లేని చిన్నారులు.. పెరిగి పెద్దయ్యాక నేరగాళ్లుగా మారతారనీ పెన్సిల్వేనియాలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ క్రిమినాలజీ జరిపిన అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ అధ్యయనంలో భాగంగా మూడు సంవత్సరాల వయస్సులో పెద్ద శబ్దాలకు, పేలుళ్లకు ఏర్పడే పిల్లల స్పందనను.. భయం కారణంగా వారిలో విడుదలయ్యే చెమటను, వారి భయాన్ని పరిశోధకులు అంచనా వేశారు.

ఇదే విషయాలను ఇరవై సంవత్సరాలు దాటిన తరువాత పైవారికి సంబంధించిన కోర్టు రికార్డులను పరిశీలించి చూడగా.. చిన్న వయస్సులో భయం అనేదే ఎరుగనివారు తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు పరిశోధకులు గుర్తించారు. అలాగే.. 23 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఏ నేరాలకూ పాల్పడనివారు.. మూడేళ్ల వస్సులో పేలుడు శబ్దాలకు కొద్దిగా ఉలిక్కిపడటం, కర్ణ కఠోరమైన శబ్దాలకు చిరాకు పడటం లాంటి చేసినట్లు గమనించారు.

ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన యూ గావో మాట్లాడుతూ... సామాజిక స్థితిని పట్టించుకోకుండా, ధిక్కరించి ఆగడాలకు పాల్పడే మనస్తత్వం ఉన్నటువంటివారు చిన్న వయస్సులో అసలు భయం అనేదే ఎరుగకుండా ఉండి ఉంటారని నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. అయితే చక్కటి పోషణ, మంచి వ్యాయామం, మానసిక సంతులనం కలిగిన వాతావరణంలో పెరిగిన చిన్నారుల విషయంలో ఇలాంటి ప్రమాదాలేవీ ఉండబోవని గావో స్పష్టం చేశారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.