"పోకిరి" చిత్రంలో హీరోయిన్ ఇలియానా తమ్ముడిగా నటించిన భరత్ కుమార్ ప్రస్తుతం తెలుగులో అత్యంత బిజీగా ఉన్న బాల నటుల్లో ఒకడు. తమిళ చిత్రం "నైనా"తో వెండి తెర ప్రవేశం చెసిన భరత్ కుమార్.. పద్మశ్రీ కమల్ హాసన్ నటించిన "పంచతంత్రం" చిత్రంతో పాటు.. మూడు చిత్రాల్లో నటించాడు.
అలాగే.. తెలుగులో మాత్రం "గుండుంబా శంకర్", "హ్యాపీ", "వెంకీ", "టాటా బిర్లా మధ్యలో లైలా", "పోకిరి" వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన "ఆనందమానందమాయే" చిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయమైన భరత్ కుమార్‌తో ముఖాముఖీ... ప్ర: తమిళ చిత్ర రంగంలో నీకు ఎలా అవకాశం లభించింది? భరత్.. నాకు చిన్న వయస్సునుంచే సినిమాలంటే మహా ఇష్టం. ప్రముఖ ఏవీఎం సంస్థ యూనిట్ వాళ్లు నన్ను చూసి, వాళ్లు తీస్తున్న నైనా చిత్రంలో నటించాల్సిందిగా కోరారు. మా తల్లిదండ్రులకు వారు నచ్చజెప్పారు. అలా నా తొలి చిత్ర రంగం ప్రవేశం జరిగింది. ఆ తర్వాత ప్రముఖ హీరో కమల్ హాసన్ చిత్రం పంచతంత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ లభించింది.
ప్ర .. మరీ తెలుగులో అవకాశం సంగతి? భరత్.. పంచతంత్ర తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రాన్ని చూసిన దర్శకుడు శ్రీను వైట్ల ఆనందమానందమాయే చిత్రంలో అవకాశం ఇచ్చారు. అది మంచి పాత్ర కావడంతో నేను తెలుగులో పాపులర్ అయ్యాను. అలా ప్రవేశించిన నేను ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో 15 చిత్రాలకు పైగా చేశాను.
|