బ్రహ్మనందం హాస్యాన్ని ఇష్టపడతాను: భరత్ కుమార్
"పోకిరి" చిత్రంలో హీరోయిన్ ఇలియానా తమ్ముడిగా నటించిన భరత్ కుమార్ ప్రస్తుతం తెలుగులో అత్యంత బిజీగా ఉన్న బాల నటుల్లో ఒకడు. తమిళ చిత్రం "నైనా"తో వెండి తెర ప్రవేశం చెసిన భరత్ కుమార్.. పద్మశ్రీ కమల్ హాసన్ నటించిన "పంచతంత్రం" చిత్రంతో పాటు.. మూడు చిత్రాల్లో నటించాడు.
అలాగే.. తెలుగులో మాత్రం "గుండుంబా శంకర్", "హ్యాపీ", "వెంకీ", "టాటా బిర్లా మధ్యలో లైలా", "పోకిరి" వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన "ఆనందమానందమాయే" చిత్రం ద్వారా తెలుగు చిత్ర సీమకు పరిచయమైన భరత్ కుమార్‌తో ముఖాముఖీ...
ప్ర: తమిళ చిత్ర రంగంలో నీకు ఎలా అవకాశం లభించింది?
భరత్.. నాకు చిన్న వయస్సునుంచే సినిమాలంటే మహా ఇష్టం. ప్రముఖ ఏవీఎం సంస్థ యూనిట్ వాళ్లు నన్ను చూసి, వాళ్లు తీస్తున్న నైనా చిత్రంలో నటించాల్సిందిగా కోరారు. మా తల్లిదండ్రులకు వారు నచ్చజెప్పారు. అలా నా తొలి చిత్ర రంగం ప్రవేశం జరిగింది. ఆ తర్వాత ప్రముఖ హీరో కమల్ హాసన్ చిత్రం పంచతంత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ లభించింది.
ప్ర .. మరీ తెలుగులో అవకాశం సంగతి?
భరత్.. పంచతంత్ర తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రాన్ని చూసిన దర్శకుడు శ్రీను వైట్ల ఆనందమానందమాయే చిత్రంలో అవకాశం ఇచ్చారు. అది మంచి పాత్ర కావడంతో నేను తెలుగులో పాపులర్ అయ్యాను. అలా ప్రవేశించిన నేను ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో 15 చిత్రాలకు పైగా చేశాను.
ప్ర .. కమల్ సార్‌తో నటించేటపుడు ఎలా ఫీలయ్యావు?
భరత్ .. ఆయనో పెద్ద స్టార్. అయితే ఆయనతో కలిసి నేను ఓ పాత్ర చేశానుకోండి. అయితే.. ఆయనో ఎంతో చనువుగా ఉంటారు. ఆయనెప్పుడూ నన్ను ఫ్రెండ్ అని పిలుస్తుంటారు. నేను ఎక్కడైనా ఓ సన్నివేశంలో కనిపించానుకోండి.. అక్కడ నా బుగ్గపై ముద్దు పెడుతుంటాడు.
ప్ర .. మరి తెలుగు హీరోల పరిచయం ఎలా ఉంది?
భరత్ .. వారు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగు, తమిళం అనేది సమస్య కాదు. ప్రతి ఒక్కరు అప్యాయంగా పలుకరించేవారు. పవన్ కల్యాణ్ కావచ్చు, రవి తేజ లేదా మహేష్ బాబు ప్రతి ఒక్కరు సాఫ్ట్ మైండ్‌తో పని చేసేవారు.
ప్ర .. సన్నివేశాలను దర్శకులు ఎలా వివరించేవారు?
భరత్ .. ప్రతి దర్శకుడు.. సన్నివేశాన్ని ముందుగా వివరించేవారు. ఒక వేళ నాకు అర్థం కాకపోతే.. వారు డెమో చేసి చూపించేవారు. కేవలం ఒక్క దర్శకుడు మాత్రమే కాదు అందరూ అలా చేసేవారు.
ప్ర .. నీవు అంగీకరించిన ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి.?
భరత్ ... ప్రస్తుతం తెలుగులో జాజిమల్లి చిత్రంలో ఓ పాత్ర పోషిస్తున్నా. నా పేరు భరత్ కుమార్. ఈ చిత్ర దర్శకుడు పేరు కూడా భరత్ కుమారే. ఇవి కాక మరికొన్ని తెలుగు చిత్రాలు అంగీకరించాను.
ప్ర .. నీ చదువులకు ఆటంకం కలగడం లేదా?
భరత్ .. నేను ఆరో తరగతి చదువుతున్నా. యాక్టింగ్ కంటే స్టడీస్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నా. నటనతో సంబంధం లేకుండా నా చదువులను కొనసాగిస్తా.
ప్ర .. నీకు పెద్ద హీరో కావాలన్న ఆశ ఉందా?
భరత్ .. లేదు. అయితే మంచి డాక్టర్ కావాలన్న కోర్కె ఉంది. అయితే.. ఆ నిర్ణయాన్ని మా తల్లిదండ్రులకు వదిలి పెడున్నా. వాళ్లు ఏం చెపితే అది చేస్తాను. నేను హీరో కావాలని వాళ్లు కోరుకుంటే మాత్రం హీరో అవుతా.
ప్ర .. ఏ చిత్ర పరిశ్రమను నీవు ఇష్టపడతావు?
భరత్ .. రెండు ఇష్టమే. ప్రతి ఒక్కరు బాగా చూసుకుంటున్నారు. ఎక్కడ అవకాశాలు లభిస్తే అక్కడ చేస్తాను. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో నాకు ఎలాంటి తేడాలు కనిపించలేదు.
ప్ర .. మీకు వాయిస్ ఎవరు డబ్బింగ్ చెపుతున్నారు?
భరత్ .. నేనే. తెలుగు డైలాగులను తమిళంలోకి రాసుకుని, వాటిని చదువుకుని తెలుగులో చెపుతాను.