ప్రధాన పేజి   ఇతరాలు > బాలప్రపంచం > కథలు
 
దొంగతనం తాత్కాలిక సుఖం ఇస్తుంది
ఊర్మిళా నగరంలో పురాతనమైన వేప, మర్రి కలిసిన మహావృక్షం గ్రామప్రజల పూజలు అందుకుంటోంది. ఆ చ్టెటుపై ఎంతోకాలంగా కాకులు గూళ్ళు కట్టుకొని నివసిస్తూ, గ్రామప్రజలు చెట్టుకు నైవేద్యం పెట్టే వడపప్పు వంటివి తింటూ హాయిగా జీవిస్తున్నాయి. ఓ రోజు ముసలికాకి ఒకటి ఎక్కడనుంచో వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. చెట్టుపైన ఉన్న కాకులు దాన్ని చూసి ఎగిరివచ్చి చెట్టు దగ్గరకు చేర్చి సేవలు చేసి తెలివి తెప్పించాయి.

పాపం ఆ ముసలికాకి కుంటిది. మెల్లగా లేచి తన చుట్టూ ఉన్న కాకులను చూసి ఆనందపడింది. అక్కడే ఉంటూ కొద్దిరోజులకు అది కోలుకుంది. తన గత అనుభవాలను ఇతర కాకులకు కథలుగా చెప్పేది. కాలం గడుస్తోంది. అయితే రోజూ వడపప్పు తింటూ అలా గడపడం ముసలికాకికి నచ్చలేదు.

ఓ రోజు ముసలికాకి చెట్టుపైన ఉన్న కాకులన్నింటినీ సమావేశపరిచి పెద్ద ఉపన్యాసం ఇచ్చింది. ‘నాతోటి కాకుల్లారా! ఎంతకాలం ఇలా జీవనం. మీకు, ఈ చెట్టు - చెట్టుకు పెట్టే నైవేద్యం తప్ప మరొకటి తెలీదు. ఒకసారి ప్రపంచాన్ని చూడండి. తెలివి ఉపయోగిస్తే ఎన్నో రుచులను చవిచూడవచ్చు’ అని చెప్పింది. కాకులు అంతా విని మొహమాటం లేకుండా మాకు వేరే రుచులు వద్దు. ఈ జీవితమే హాయిగా ఉంది. రుచుల కోసం దొంగతనం చేయం’ అన్నాయి. ముసలికాకి మూతి ముడుచుకుని వంటరిగా మిగిలిపోయింది.

అయినా ఊరుకోకుండా సమయం చూసి ఓ బక్కకాకికి మళ్ళీ తన ఉపన్యాసం వినిపించి ‘ ఇలా బక్కగా ఉండటానికి కారణం సరైన తిండిలేకపోవడమే. నేను చెప్పినట్లు చేస్తే నెలరోజుల్లో కండలు పెరుగుతాయి’ అని చెప్పింది. పాపం బక్కకాకి ఆశపడి సరేనంది. ముసలికాకి ఆలస్యం చేయకుండా బక్కకాకిని వెంటపెట్టుకుని గ్రామంలోకి వచ్చింది. ముందు మాంసం కొట్టు దగ్గర పారేసిన మాంసం రుచిచూపించింది. మరోచోట చేపల రుచి.. ఇలా ఊరంతా తిప్పింది. కొత్త రుచులకు బక్కకాకి మురిసిపోయింది.
 
  1 | 2  >> 
మరిన్ని
తెలివైన వాడికే రాజ్యం
అడ్డదారి విజయం.. భవిష్యత్ అంధకారానికి మార్గం
తెనాలి రామలింగడి తెలివి అలాంటిది
పరమానంద పరోపకారం
బాల్యం నుంచే పొదుపు అలవాటు చేసుకోవాలి
మేలుచేసిన గోపాలం పొదుపు