దీంతో నలుని దేహఛాయ నలుపురంగులోకి మారిపోతుంది. నలుడు కురిపి అవుతాడు. నలుని ఎవ్వరూ గుర్తించలేని పరిస్థితి తలెత్తుంది. బాహుకుని పేరుతో రధసారధిగా మారి విదర్భ రాజ్యానికి చేరుకుంటాడు నలుడు. పవిత్ర ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే దమయంతికి వికృతరూపంలోని నలుని ఇట్టే గుర్తించింది. కలసిన జంట ఆనందానికి అంతేలేదు. శనిప్రభావం తొలగింది. నలుని వికృతరూపం మాయమై నిజరూపం కలిగింది. పుష్కరునితో మరోసారి జూదమాడిన నలుడు కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి దక్కించుకుంటాడు.
దమయంతి కేవలం రూపవతియే కాదు నలుని ప్రేమ పట్ల అచంచలమైన అనురాగాన్ని ప్రదర్శించి నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. స్వయంవరంలో దేవతల సౌందర్యానికి లోనుకాక నలుని వరించింది దమయంతి. అంతేకాక వికృతరూపంలోని నలుని బాహ్యరూపాన్ని కాక అంతఃసౌందర్యానికి ప్రాధాన్యతను ఇచ్చి స్వచ్ఛమైన ప్రేమకు దమయంతి తార్కాణమైంది.
|