మగువ అందచందాలే పలుతావుల పువు్వలు ! మగువకు రత్నాల సగలు, తెలివెన్నెల నవు్వలు!!
మగువ శీల సంపదయే రుచులూరే మకరందం ! మగువ కురియు అనురాగమె మగని మదికి చందనం!! మగువ వదన శోభయే మురిపించే అరవిందం ! మగువ పలుకు ప్రతి పలుకూ, పతి హృదయ స్పందనం!!
మగువ చూపు మరులూరే మన్మథ బాణం ! మగువ వలపు పిలుపదే మగనికి ప్రాణం !! మగువ నెంచు ప్రతి తలపూ కోయిల గానం ! మగువ పెదవి విందే కద ప్రేమ సుధాపానం!!
మగువ కన్నుసన్నలే నవరసాల గిన్నెలు! మగువ సొగసు చూడ చూడ వానవిల్లు వన్నెలు!! మగువ రేపు కోరికలే రతికి వెలుగు రేకలు!
|