1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. చిట్కాలు

ప్రేమ రాజ్యంలో రారాజులు కావాలంటే... ?

ప్రేమాయణం చిట్కాలు ప్రేమ రాజ్యం రారాజులు అలజడి మనసు ప్రేయసి లేదా ప్రియుని వశం
యవ్వన ప్రాయంలో మనసులో ప్రేమ అలజడి ఒక్కసారి ప్రారంభమైందంటే మనిషి మనసు ఊహల్లో విహరించడం ప్రారంభిస్తుంది. తనకు నచ్చినవారు తనకోసం రెక్కలు కట్టుకుని వచ్చేసినట్టు వారితో కలిసి తాను సైతం గగనం విహరించినట్టు తమ ప్రేమ పయనంలో తాము తప్ప మరెవరూ లేనట్టు... ఇలా మనసు ఊహించుకోవడం ప్రారంభిస్తుంది.

అప్పటివరకు ఏ విషయం గురించి కూడా అంతగా పట్టించుకోని మనిషి మనసు ప్రేమ విషయాన్ని మాత్రం సీరియస్‌గానే తీసుకుంటుంది. అందుకే కళ్లు తెరిచినా మూసినా తమ ప్రేయసి లేదా ప్రియుని గురించి ఆలోచిస్తూ కాలాన్ని గడిపేస్తానంటుంది. ఎందుకో తెలియదుగానీ తమలో ప్రేమ భావాన్ని చిగురింపిజేసిన వారిపైన మనసు పిచ్చిగా అభిమానాన్ని పెంచేసుకుంటుంది.
కష్టే ఫలి అంటే అదే మరి...
  ప్రేమ జంటలు ఇంత ఆనందంగా ఎలా విహరిస్తున్నాయంటే వారంతా తమ ప్రేమను గెలిపించుకునేందుకు ఎవో కన్ని ప్రయత్నాలు చేసి చివరకు విజయం సాధించినవారే అన్న విషయం మర్చిపోరాదు.      


అప్పటివరకు కనీసం వారి తలపు కూడా లేకుండా బ్రతికిన మనిషి మనసు చేసే ఈ వింత అల్లరితో తమ ప్రేయసి లేదా ప్రియునితోటిదే తమ లోకమని వారంటూ లేకుంటే ప్రపంచంలో మరేదీ తనకు అవసరం లేదనే స్థాయికి చేరుకుంటారు. మనసులో ప్రేమభావం అడుగుపెట్టడం, దానికోసం మనిషి తపించడం ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు నచ్చినవారిని మన వశం చేసుకోవడం ఎలా అనేది మనిషికి ఓ పెద్ద మిస్టరీలా అనిపిస్తుంది.

దాంతో తమలో ప్రేమ జ్వాలను రగిలించినవారిలో తాము కూడా ప్రేమ భావాన్ని పుట్టించేందుకు మనిషి నానా కష్టాలు పడడం మనందరికీ తెలిసిన విషయమే. ఇలా ఒకవైపే ప్రేమభావం కల్గినవారు ఎదుటివారిలోనూ ప్రేమభావం రగిలించడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ప్రేమ కోసం వీరిలా అవస్థలు పడుతుంటే వీరి ప్రేమకు కారణమైనవారు మాత్రం దీని గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తిరిగేస్తుంటారు.

కొన్నిసార్లు వీరు ధైర్యం చేసి తమలోని ప్రేమ విషయాన్ని చెప్పినా వారు మాత్రం దాన్ని అంత సీరియస్ విషయంగా భావించరు. దీంతో ప్రేమలో పడ్డవారు ఏమి చేయాలో పాలుపోక తెగ దిగులుపడుతుంటారు. అయితే తమలో కలిగిన ప్రేమభావం ఎదుటివారిలోనూ కలిగించి చివరకు ఇద్దరూ కలిసి ప్రేమ సామ్రాజ్యంలో ఆనందంగా జీవించాలంటే కాస్త ఓపిక అవసరం అనే విషయాన్ని ప్రేమికులు గుర్తించాల్సి ఉంటుంది.


మనలో ప్రేమ ఉప్పొంగిన వేళనే ఎదుటివారిలోనూ ప్రేమభావం ఉరకలు వేయాలంటే అది అందరి విషయంలో జరగకపోవచ్చు. ఎందుకంటే లోకంలోని చాలా ప్రేమలు ప్రారంభంలో ఒకవైపు నుంచి మాత్రమే ప్రారంభమవుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. మరి అలాంటప్పుడు ఇన్ని ప్రేమ జంటలు ఇంత ఆనందంగా ఎలా విహరిస్తున్నాయంటే వారంతా తమ ప్రేమను గెలిపించుకునేందుకు ఎవో కన్ని ప్రయత్నాలు చేసి చివరకు విజయం సాధించినవారే అన్న విషయం మర్చిపోరాదు.

మీలో కల్గిన ప్రేమభావాన్ని ఎదుటివారిలోనూ కల్గించాలంటే ముందు వారి గురించి మీరు పూర్తిగా తెల్సుకునేందుకు ప్రయత్నించండి. వారి ఆలోచనలు, భావాలు, అభిరుచులు అసలు మీరంటే వారికున్న అభిప్రాయం తదితర అంశాలపై కొంత అవగాహనకు రండి. తద్వారా వారిని మీవైపు తిప్పుకోవాలంటే మీరు ఏం చేయాలనే విషయంలో మీకు ఓ నిర్ధిష్టమైన ఆలోచన ఏర్పడుతుంది.
ప్రేమంటే అదే మరి...
  ఎదుటివారు మీ ప్రేమను నిరాకరించారంటే దానికీ ఓ బలమైన కారణం ఉండే అవకాశం ఉంది. ఆ కారణమేంటో తెల్సుకుని ఆ వైపుగా మీ ప్రయత్నాలను మీరు ప్రారంభిస్తే అంతిమ విజయం మీదే. ఎందుకంటే లోకంలో నిజమైన ప్రేమ ఎపుడూ ఓడిపోదు      


ఆ విధంగా ఓ ఆలోచన ఏర్పడిన తర్వాత దాని ప్రకారం మీరు ముందుకు వెళ్లండి. అప్పుడు ఎదుటివారిలోనూ మీరంటే ఓ రకమైన ఆసక్తి, మీగురించి తెల్సుకోవాలనే ఉత్సాహం ఏర్పడుతాయి. సరిగ్గా ఆ సమయంలో మీ గురించి వారికి కాస్త గొప్పగా తెలిసేలా చేయండి. అంతేకాదు ఆ సందర్భంలో మీరు వారిని ఇష్టపడుతున్నారనే విషయాన్ని పరోక్షంగా తెలియజేయండి.

అలా కొన్నిసార్లు జరిగితే వారిలోనూ మీపై ప్రేమభావం ఏర్పడి ప్రారంభంలో మీరు అనుభవించిన ప్రేమ తాలూకు ప్రభావాన్ని వారూ అనుభవించడం ప్రారంభిస్తారు. అప్పటికే ప్రేమలో మునిగిన మీరు ఆ విషయాన్ని సులభంగానే గుర్తించగలరు. అలా మీ ఇద్దరి మధ్యా ప్రేమబంధం ఆ మాత్రం పెనవేసుకోగల్గితే ఇక మీరు నిర్మోహమాటంగా మీ ప్రేమ విషయాన్ని వారి వద్ద బహిర్గతం చేయవచ్చు.

సరిగ్గా అలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న మీ ప్రేయసి లేదా ప్రియుడు ఆ సమయంలో మీ ప్రేమను నిరాకరించే అవకాశం దాదాపు ఉండదు. ఒకవేళ ఆ తరుణంలోనూ ఎదుటివారు మీ ప్రేమను నిరాకరించారంటే దానికీ ఓ బలమైన కారణం ఉండే అవకాశం ఉంది. ఆ కారణమేంటో తెల్సుకుని ఆ వైపుగా మీ ప్రయత్నాలను మీరు ప్రారంభిస్తే అంతిమ విజయం మీదే. ఎందుకంటే లోకంలో నిజమైన ప్రేమ ఎపుడూ ఓడిపోదు.
About Writer
Munibabu