అతి శృంగారం వద్దు... శృతిమించని రొమాన్స్ ముద్దు
|
సాధారణ స్థాయిని మించిన శృంగారంలో ఓలలాడేవారు, శృంగారానికే ప్రాధాన్యం ఇస్తారు తప్ప తమ సంబంధాలను పటిష్టపరచుకునేందుకు ప్రయత్నించరు. కేవలం శృంగార కాంక్షతోనే అవతలి వ్యక్తిని చూస్తుంటారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని యుహెచ్ మానసిక విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ వెల్లడించారు.
అంతేకాదు ఇటువంటి సమస్యలో పూర్తిగా కూరుకుపోయినవారు ఒకరికంటే ఎక్కువ భాగస్వాముల ప్రేమకై పరితపిస్తుంటారు. ఈ ప్రవర్తన దాంపత్య సంబంధాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. కనుక అతి శృంగార భావనలను మనసు నుంచి తొలగించే ప్రయత్నం చేయాలంటున్నారు.
మితిమీరిన శృంగారం అనే అంశంపై కొందరు విద్యార్థులను పరిశీలించినపుడు అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయంటున్నారు పరిశోధకులు. వారి ప్రవర్తనలో... ప్రత్యేకించి వారిలోని రొమాంటిక్ బంధాలు స్థిరంగా లేవు. హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపించాయి. ముఖ్యంగా మితిమీరిన శృంగార బంధాన్ని నెరపుతున్నవారిలో వారి బంధంపై నమ్మకం లేని స్థితిలో కొట్టుమిట్టాడటాన్ని గమనించారు. కనుక "అతి" ... అనర్థదాయకం అనే పెద్దల మాట ముమ్మాటికీ నిజం.
