1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. చిట్కాలు

ఛీ.. ఛీ పో... అయినా వెంబడిస్తారా...?

ప్రేమ చిట్కాలు అబ్బాయిలు అమ్మాయిలు భావోద్వేగం నిర్ణయం క్షణికావేశం
WD
సహజంగా కొందరు అబ్బాయిలు అమ్మాయిలను చూడగానే ప్రేమ... అంటూ వారిని వెంబడిస్తూ, "ఛీ... పో" అన్నప్పటికీ వదలక విసిగిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రవర్తన అమ్మాయిలకు ప్రాణసంకటంగా మారుతోంది. ఒకే కాలేజీలో చదువుకునే సందర్భంలో అబ్బాయిలు అమ్మాయిలను పలకరించగానే వారు కూడా పలకరిస్తారు.

అంతటితో అబ్బాయిలు ఊరుకోరు. చూసి, పలకరించిన అమ్మాయే తమ కలల రాణిగా భావించి ఊహల్లో తేలియాడుతుంటారు. ప్రతి రోజు కాలేజీకి వెళ్లడంమాట అలా ఉంచితే ఆ అమ్మాయి కోసం తాము ఏమైనా చేయడానికి సిద్దమన్నట్లు ప్రవర్తిస్తుంటారు. అయితే ఇది సరికాదంటున్నారు ప్రేమపై లోతుగా అధ్యయనం చేసిన నిపుణులు. అవేంటో కాస్త చూద్దామా...
మీ ఒక్కరిపైనే ఎన్నో జీవితాలు...
  క్షణికావేశానికిలోనై మీరు తీసుకునే నిర్ణయం... మీరు ప్రేమించామని చెప్పే అమ్మాయి జీవితంతోపాటు మీరు.. మీ స్నేహితులు... మీ కుటుంబం.. ఇలా అందర్నీ "ప్రేమ" బాధితుల జాబితాలో చేరుస్తుంది. ఇదంతా కేవలం మీ "ఒక్కరి" వల్లనే      


భావోద్వేగానికి లోనుకాకండి... ముఖ్యంగా అబ్బాయిలు.. "ప్రేమ" అనగానే భావోద్వేగానికి గురౌతారు. తాము ఉద్వేగానికి లోనైనప్పుడు మనసులోని మాట చెప్పలేకపోతారు. కనుక ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడండి. మీ ప్రేమను వ్యక్తపరచడానికి సరియైన సమయాన్ని ఎంచుకోండి. ఆమె అంగీకరించవచ్చు లేదా తిరస్కరించనూవచ్చు. అంగీకరిస్తే ఆకాశమే హద్దు.

ఒకవేళ తిరస్కరిస్తే పాతాళానికి దిగజారిపోయి కృంగిపోకూడదు. ప్రపంచం శూన్యమైపోయిందన్నట్లు వ్యవహరించకూడదు. నిరాశ చెందనవసరం లేదు. ఈ వ్యతిరేఖ ఆలోచనలు మిమ్మల్ని వ్యతిరేఖ మార్గంలోకి పయనింపజేస్తాయి. ఫలితంగా మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కుటుంబం కుంగిపోతుంది.

క్షణికావేశానికిలోనై మీరు తీసుకునే నిర్ణయం... మీరు ప్రేమించామని చెప్పే అమ్మాయి జీవితంతోపాటు మీరు.. మీ స్నేహితులు... మీ కుటుంబం.. ఇలా అందర్నీ "ప్రేమ" బాధితుల జాబితాలో చేరుస్తుంది. ఇదంతకేవలం మీ "ఒక్కరి" వల్లనే. కనుక ( ఒన్ సైడ్) ప్రేమ విఫలమైనప్పుడు మరీ అంత కుంగిపోవాల్సిన పనిలేదు. జీవితం ఎంతో ఉంది.

WD
ఐలవ్యూ చెప్పేయకండలా...

సూటిగా చెప్పాలంటే... మీ నిర్ణయం స్పష్టంగా ఉండాలి.... ఎవరైతే సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకుంటారో అలాంటి వారినే అమ్మాయిలు ఇష్టపడతారు. మీరు చెప్పే ప్రతి విషయం స్పష్టంగా, నిజాయితీగా ఉండాలి. ఒక్కసారి మీరు చెప్పింది "అబద్దం" అని తేలిపోతే జన్మలో మీ ముఖం చూడరు అమ్మాయిలు. అది వారి తప్పు కాదు. ముమ్మాటికీ మీదేనన్న సంగతి మర్చిపోకండి. స్పష్టత లేని యువకులను అమ్మాయిలు ఇష్టపడరన్న విషయాన్ని గుర్తుంచుకోండి.

ప్రేమించే అబ్బాయిలూ.... మీరు ఆత్మన్యూనతాభావాన్ని విడనాడాలి... ఎల్లప్పుడూ ఏదో కోల్పోయినట్లు నిరాశా, నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడకండి. తన బాయ్‌ఫ్రెండ్ లక్ష్య సాధనవైపు దూసుకు వెళ్లేవాడై ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. ఎవరైతే తమ లక్ష్యం వైపు దృష్టి సారిస్తుంటారో అలాంటి వ్యక్తులనే అమ్మాయిలు ఎక్కువగా ఇష్ట పడుతుంటారు.

ఎందుకురా తొందర... ఎవరైనా అమ్మాయి మీకు నచ్చితే వెంటనే "ఐ లవ్ యూ" చెప్పేయకండి. బహుశా ఆ అమ్మాయి మీతో స్నేహాన్ని మాత్రమే ఆశిస్తూ ఉండొచ్చుకదా... కనుక స్నేహమో... ప్రేమో తెలియాలంటే కొంత సమయం అవసరం. ఆ సమయం... మీది 'ప్రేమో' లేక 'స్నేహమో' తేల్చేస్తుంది. కనుక కాలానికి కట్టుబడి ఉండండి. ఉద్వేగానికిలోనై మీ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్.
About Writer
Gulzar Ghouse