1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. చిట్కాలు

మీరు ఇంకా ఒంటరిగానే ఎందుకున్నట్లు...?

ప్రేమ ఒంటరి భావన మాటలు ప్రేమికులు ప్రేయసి ప్రియురాలు
WD
రెండు హృదయాలకు వేసే తీయని బంధం ప్రేమ. రెండు మనసులు ఏకం కావాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి అభిప్రాయాలు మరికొరితో దాదాపు సరిపోలాలి. అలా కుదరనప్పుడు ప్రేమ భావనలు మొలకెత్తడానిక ఏ మాత్రం అవకాశం ఉండదు. మాటలు, చేష్టలు, ప్రవర్తన... ఇలా అన్నింటా "క్లీన్"గా ఉన్నప్పుడే... సదరు వ్యక్తితో చెలిమి చేయడానికి ఎవరైనా ఇష్టపడతారు. చెప్పే మాటలకు, చేసే పనుల మధ్య తేడాలుంటే ఆ వ్యక్తి జోలికి ఎవ్వరూ రారు. అతని జీవన గమనం ఒంటరి నావలోనే సాగే ప్రమాదమేర్పడుతుంది.

ఇటువంటి ఒంటెద్దు పోకడ మనస్తత్వంతో ఉన్నవారు ఎదుటి వ్యక్తిని పలుకరించినా... అవతలివారు ముఖం అటు తిప్పుకు వెళతారు. ఇలా జరుగుతోందంటే మన ప్రవర్తనలో ఏదో తేడా ఉందని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాటిని గుర్తించి పారదోలడానికి ప్రయత్నించాలి. "తాబట్టిన కుందేలుకు మూడే కాళ్లు" అనే ధోరణితో ఉన్నవారిని ప్రేమ హృదయాలు మీటే అవకాశమే ఉండదు.

పదారేళ్ల ప్రాయం నుంచే కొందరికి పెంకితనం అలవాటుగా ఉంటుంది. కుటుంబ సభ్యులు కనుక ఇటువంటి ప్రవర్తనలను భరిస్తారు. అదే ప్రేమ విషయంలో రాజీపడే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే ఒక్కసారి మనసు ఇచ్చిన తర్వాత దానికే జీవితాంతం కట్టుబడి ఉండాలి కనుక. అందువల్లనే ఆహ్లాదకరమైన లోకంలో విహరింపజేయగల నిండు హృదయాలనే కోరుకుంటుంది ప్రతి ప్రేమ హృదయం. అలాంటి భావనలకు చోటులేని హృదయాలు ఒంటరిగానే పయనించాల్సి వస్తుంది. కనుక ఆలోచనలు, ప్రవర్తనలు అన్నీ ఆహ్లాదకరంగా ఉంచుకునేందుకు యత్నించాలి. అప్పుడే పరిపూర్ణమైన ప్రేమ హృదయం వెతుక్కుంటూ వస్తుంది.
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి