కళ్లు కళ్లూ కలిపి.. చిరనవ్వు చిందిస్తే...
|
అయితే మీ కాబోయే భాగస్వామికి కూడా మీ పట్ల ఆకర్షణ కలిగిందేమో తెల్సుకోవడానికి శరీరభాష చాలా ఉపయోగపడుతుంది. అసలు శరీరభాషకీ, శారీరక ఆకర్షణకీ మధ్య బలమైన సంబంధం ఉన్నది. ఆకర్షణను వ్యక్తం చేసే శరీరభాష ఎలా ఉంటుందంటే....
ఒకరు మీతో మాట్లాడుతున్నప్పుడు లేదా మీతో కల్సి నడుస్తున్నప్పుడు తరచుగా మిమ్మల్ని తాకుతుంటే, అది మీరంటే వారికి ఆకర్షణ ఉందనే సూచన.
మిమ్మల్ని ఒక వ్యక్తి తదేకంగా చూడటం అనేది కూడా వారికి మీ పైనున్న ఆకర్షణకు సంకేతమే.
మీరు వారితో కళ్లు కలిపినప్పుడు వారు చిరునవ్వు చిందించారంటే ఇదీ ఆకర్షణకు సంకేతమే.
ఒకరు భుజాలు మీకు ఆన్చి కూర్చున్నారంటే, అది వారు మీపట్ల ఆకర్షితులయ్యారనేందుకు సంకేతం.
కనుక ఈ లక్షణాలతో ఎవరైనా మీకు దగ్గరవుతున్నట్లు తోస్తే.... వారి మనసంతా మీరేనన్నమాట.
