ప్రేమికునిపై సవారీ... మూతి విరుపులు పరారే
|
* ప్రేయసి బుంగమూతి పెట్టుకుని కూర్చున్నప్పుడు అమాంతం ఆమెను ఎత్తుకుని ముద్దాడాలట. ఎలా ఎత్తుకుంటారో.. ఎలా ముద్దాడుతారో అప్పటి పరిస్థితిని బట్టి ఉంటుందనీ చెపుతున్నారు. ఇలా చేసిన మరుక్షణం... అప్పటివరకూ చిందులేస్తూ భగభగలాడే ప్రేయసి కూల్ అయిపోతుందట.
* ముఖం చిట్లుంచుకుని అటువైపు తిరిగి కూర్చున్న సఖిని ప్రసన్నం చేసుకోవాలంటే వేడుకోలు ఒక్కటే మార్గం. ప్రియుడు ఆమె ముందు మోకరిల్లితే కోపం "తుస్" మంటుందట. ప్రేయసి మళ్లీ మామూలైపోతుందట.
* ఎంత బతిమాలినా వినని, ఎంత ముద్దాడినా కనికరించని మొండి ప్రేయసి మనసు మైనంలా కరగదీయటానికి మహత్తర మార్గం ఒక్కటే అని చెప్పారు. అదేమంటే... ఆమెను అమాంతం పైకి ఎత్తుకుని బిగి కౌగిలిలో బంధించాలట. ప్రపంచంలో తనకు మించిన వారు మరెవరూ లేరని చెప్పాలట. ఈ చేష్టలను పైకి ఆమె వారించినా లోలోన సంతోష పడుతుందట. తనను ఇంతగా ఆరాధించే వాడిని అపార్థం చేసుకున్నాననీ కరుణిస్తుందట.
ఇవండీ... బుంగమూతి ప్రేయసి కోపాన్ని చల్లార్చగలిగే కొన్ని చిట్కాలు...
