నవ్వించేయి... ప్రియురాలి మనసు దోచేయి
|
బ్రిటన్‌లోని నార్త్ ఉంబ్రియా యూనివర్సిటీకి చెందిన కొందరు ఔత్సాహికులు జరిపిన సర్వే ప్రకారం హాస్యాన్ని పండించే పురుషుడు తమ చెంత ఉంటే తాము హాయిగా గడిపేస్తామంటూ స్త్రీలు తేల్చి చెప్పేశారట. అంతేకాదు పురుషులకు హాస్యతత్వం ఉండడం వల్ల కుటుంబం సైతం నిత్యం సంతోషంతో వెల్లి విరుస్తుందని వారు చెబుతున్నారు.
అంతేకాదండోయ్... ఇంకా పెళ్లికాకుండా, ఒంటరిగా ఉన్న మహిళలను ఈ సర్వేలో భాగంగా కదిలిస్తే పురుషుల్లో తాము కోరుకుంటున్న లక్షణాల్లో చతురత కలిగిన తత్వం తప్పకుండా ఉండాలంటూ కండీషన్ పెట్టారట. సో... సీరియస్‌గా మొహం పెట్టి మాస్ సినిమా హీరోలాగా ఫోజు కొట్టకుండా సాధారణంగా పక్కింటి అబ్బాయిలా మీకు నచ్చిన అమ్మాయి మొహంపై చిరునవ్వు తెప్పించేందుకు ప్రయత్నించి చూడండి.
అలా అలా మీ ఇద్దరి మధ్య వికసించే నవ్వులు పరిమళాలు మీ ప్రియురాలి మనసును దోచేయకపోవు. అలా తన మనసును దోచేసిన మీలోని చతురతకు మీ ప్రియురాలు తనకు తెలియకుండానే దాసోహం కాకపోదు. అందుకే మీ ప్రియురాలిని నవ్వించేయండి... ఆమె మనసును మొత్తంగా దోచేయండి... ఆల్ ద బెస్ట్... ఫ్రెండ్స్.
