ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం... అన్నాడో సినీకవి. నిజమే మనసును దోచిన ప్రేయసి ఊహల్లో తనతో షికారు చేస్తున్నా నిజ జీవితంలో మాత్రం తనను చూస్తేనే మండిపడుతుంటే సదరు ప్రేమికుని హృదయ వేదన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మరి మనసుకు నచ్చిన ప్రేయసిని తనవైపుకు తిప్పుకోవాలంటే ప్రేమికుడు ఏం చేయాలి ? మనసుకు నచ్చిన ప్రేయసి అసలు తనను చూస్తేనే ఎందుకు చిరాకుపడుతోందనే విషయాన్ని ప్రేమికుడు ముందుగా గ్రహించగలగాలి. ఏమాత్రం పరిచయం లేకుండానే తొలిచూపులోనే ఐలవ్య్యూ చెప్పినందుకా, అప్పటివరకు స్నేహితుడిగా ఉండి ఒక్కసారిగా నువ్వంటే నాకిష్టం... ఐలవ్య్యూ అంటూ చెప్పినందుకా, లేక తమ మధ్య ప్రేమ వ్యవహారాన్ని పదిమందికి తెలిసేలా చేసి తన ఇమేజ్‌ను పాడు చేసినందుకా, ఇవేమీ కాకుండా అసలు మీ ప్రేయసికి మీరంటేనే ఇష్టం లేదా ఇలా ఏ కారణం వల్ల మీ ప్రియురాలు మిమ్మల్ని చూసి చికాకు పడుతోందన్న విషయాన్ని ప్రతీ ప్రేమికుడు మొదట గ్రహించగలగాలి. అటుపై కారణానికి తగ్గట్టు ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నించాలి. ఏమాత్రం పరిచయం లేకుండానే ఐలవ్య్యూ అంటూ చెప్పినందుకు మీ ప్రేయసి మీపై ఆగ్రహించిందనుకోండి... తొలిచూపులోనే ఐలవ్య్యూ చెప్పడానికి ఎంతటి బలమైన కారణముందో ఆమెకు తెలియజేసే ప్రయత్నం చేయండి. తొలిచూపులోనే మనసు ఎంతగా స్పందించకుంటే వెంటనే ఐలవ్య్యూ అంటూ చెప్పుంటాను... ఆమాత్రం అర్థం చేసుకోలేవా... కావాలంటే నీకోసం ఎన్ని ఏళ్లైనా ఇలాగే నిరీక్షిస్తా... నాగురించి అర్థమయ్యాకే నా ప్రేమకు పచ్చజెండా ఊపు అంటూ మీ ప్రేయసికూడా మీగురించి ఆలోచించే విధంగా ఆమెకు చెప్పి చూడండి. |