Others | Romance | Tips | Love | Lover | ప్రేయసి మనసును జయించాలంటే... ?
|
ఏమాత్రం పరిచయం లేకుండానే తొలిచూపులోనే ఐలవ్య్యూ చెప్పినందుకా, అప్పటివరకు స్నేహితుడిగా ఉండి ఒక్కసారిగా నువ్వంటే నాకిష్టం... ఐలవ్య్యూ అంటూ చెప్పినందుకా, లేక తమ మధ్య ప్రేమ వ్యవహారాన్ని పదిమందికి తెలిసేలా చేసి తన ఇమేజ్‌ను పాడు చేసినందుకా, ఇవేమీ కాకుండా అసలు మీ ప్రేయసికి మీరంటేనే ఇష్టం లేదా ఇలా ఏ కారణం వల్ల మీ ప్రియురాలు మిమ్మల్ని చూసి చికాకు పడుతోందన్న విషయాన్ని ప్రతీ ప్రేమికుడు మొదట గ్రహించగలగాలి. అటుపై కారణానికి తగ్గట్టు ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ మార్గాల్లో ప్రయత్నించాలి.
ఏమాత్రం పరిచయం లేకుండానే ఐలవ్య్యూ అంటూ చెప్పినందుకు మీ ప్రేయసి మీపై ఆగ్రహించిందనుకోండి... తొలిచూపులోనే ఐలవ్య్యూ చెప్పడానికి ఎంతటి బలమైన కారణముందో ఆమెకు తెలియజేసే ప్రయత్నం చేయండి. తొలిచూపులోనే మనసు ఎంతగా స్పందించకుంటే వెంటనే ఐలవ్య్యూ అంటూ చెప్పుంటాను... ఆమాత్రం అర్థం చేసుకోలేవా... కావాలంటే నీకోసం ఎన్ని ఏళ్లైనా ఇలాగే నిరీక్షిస్తా... నాగురించి అర్థమయ్యాకే నా ప్రేమకు పచ్చజెండా ఊపు అంటూ మీ ప్రేయసికూడా మీగురించి ఆలోచించే విధంగా ఆమెకు చెప్పి చూడండి.
|
ఇవేమీ కాకుండా మీపై ఇష్టం ఉన్నా మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారాన్ని పదిమందికి తెలిసేలా చేసినందుకు మీ ప్రేయసి మీపై కోపగించుకుందనుకోండి... నిజమే అలా చేయడం పొరబాటే. ఇకపై ఎప్పుడూ అలా చేయను. ఏ విషయాన్ని బయటివారికి చెప్పాలి, ఏది చెప్పకూడదన్న విషయంలో ఇకపై జాగ్రత్తగా వ్యవహరిస్తానని చెప్పి చూడండి. మీ ప్రేయసి తప్పకుండా మెత్తబడి తీరుతుంది.
ఇలా కారణమేదైనా మీపై చిర్రుబుర్రులాడుతూ, కోపంతో ఊగిపోయే మీ ప్రేయసి ప్రసన్నం చేసుకోవడానికి మార్గం లేకపోలేదు. కాస్త ఓపిగ్గా, మరికొంచెం సమయస్ఫూర్తితో మీరు ఆలోచించగలిగితే ప్రేయసిని ప్రసన్నం చేసుకోవడం మరీ అంతకష్టమేమీ కాదు. కానీ ఇక్కడ మరో విషయం పైన చెప్పిన కారణాలు కాకుండా మీరంటే మీ ప్రేయసికి ఏమాత్రం ఇష్టం లేదంటే మాత్రం మీరు మీ ప్రేమ గురించి మరోసారి ఆలోచించక తప్పదు.
ఎందుకంటే ఏమాత్రం ఇష్టంలేని వారిని వెంటపడి మరీ ఐలవ్య్యూ అని చెప్పించుకోవడానికి జీవితం సినిమా కాదు. అందుకే మీపై మీ ప్రేయసి ఎందుకు ఆగ్రహిస్తోందన్న విషయాన్ని పూర్తిగా గ్రహించి అటుపై మాత్రమే దానికి పరిష్కారాన్ని ఆలోచించండి.
