Others | Romance | Tips | ప్రేమను కాస్త భావాత్మకంగా వ్యక్తం చేయండి
|
అలాంటి భావాన్ని తప్పించుకునేందుకు ముఖ్యంగా మగాళ్లు తమ ప్రేయసి దగ్గర అప్పుడప్పుడూ కాస్త భావాత్మకంగా ప్రవర్తించడం తప్పనిసరి. కొంచెం భావాత్మకంగా ప్రవర్తించినప్పుడే మీ ప్రేయసికి మీపై ఉన్న ప్రేమ మరింత ఉధృతమవుతుంది. అలా ఉధృతమైన ప్రేమ మీ మధ్య ఉన్న బంధాన్ని మరింత బలీయం చేస్తుంది. నీవులేని ఆక్షణం నేనెంతగా తపించిపోయానో తెలుసా... కనిపించే ప్రతి చెట్టులో, పుట్టలో నీ రూపాన్నే చూశాను తెలుసా... అంటూ కాస్త భావాత్మకంగా మీ ప్రేయసి వద్ద చెప్పి చూడండి.
కాస్త సినిమాటిక్‌గా అనిపించినా తనపై మీరు చూపించే ఆ ఆసక్తికి మీ ప్రేయసి మురిసిపోక మానదు. అలా ఆమెలో కలిగిన మురెపెం మిమ్మల్ని ముంచెత్తక మానదు. అలాగే మీ ప్రేయసి గురించి మీలో కలిగే భావాలకు అందమైన రూపాన్నిచ్చి ఆమె వద్ద చెప్పిచూడండి. ఎంతటి ప్రాక్టికల్ అమ్మాయైనా ఆనందంతో మిమ్మల్ని అల్లేయక మానదు.
మరి ఇలా భావాత్మకంగా ప్రవర్తించాలంటే అందరికీ సాధ్యమా అని ప్రశ్నించకండి. మీ ప్రేయసిపై మీకు నిజంగా ప్రేమ ఉన్నప్పుడు దాన్ని ఆమెకు మరింత అందంగా చెప్పాలని మీ మనసు తపించినప్పుడు మీలో భావాత్మకత అనేది మీకు తెలియకుండానే పుట్టుకొస్తుంది. సో... బెస్టాఫ్ లక్.
