1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. చిట్కాలు
  6. Love

Metta Love | Love | Success | Boys and Girls | మెట్ట "లవ్" వర్కవుట్ అవుతుందట...

మెట్ట ప్రేమ
WD

ఇలా వేస్ట్ బ్రదర్.. ట్రై చెయ్ "మెట్ట లవ్"

ప్రేమల్లో అనేక రకాలున్నాయని మన తెలుగు సినిమాలు చూపించాయి. ఇంకా చూపిస్తూనే ఉన్నాయి. అయితే నేటి ఆధునిక "లవర్", అన్ని ప్రేమలను మించి "మెట్ట ప్రేమ" అంటూ ఒకటి ఉందని అంటున్నాడు ఓ లవ్ బ్రదర్.

"మెట్ట లవ్" వినడానికి కొత్తగా ఉంది లవ్ బ్రదరూ.. కాస్త విడమర్చి చెప్పకూడదూ.. అని అడిగితే, ఇలా చెప్పుకొచ్చాడతను.

కళాశాల స్థాయి వయసు వచ్చాక అమ్మాయిలు- అబ్బాయిలు పరస్పరం ఆకర్షణకు లోనుకావడం సహజమే. ఈ ఆకర్షణ ప్రేమగా మారినప్పుడు, తమలోని ఆ భావాన్ని వ్యక్తీకరించడానికి ఒకరికొకరు మథనపడుతుంటారు.

ఎన్నో రోజులు బీచ్‌ల ఒడ్డున, పార్కుల చెట్ల నీడలలోన, సినిమా హాళ్లలోన కలిసి తిరుగుతారు తప్పించి తమ మనసులో ఉన్న ప్రేమ భావనను వ్యక్తీకరించలేరు. ఆ తర్వాత పుణ్యకాలం పూర్తవుతుంది. కాలేజీ చదువులు ముగుస్తాయి. ఎవరిదారిన వారు వెళ్లిపోతారు. మొలకెత్తిన ప్రేమ మొగ్గ దశలోనే కనుమరుగవుతుంది. ఇలాంటి జంటలు 90 శాతం ఉంటున్నాయట.

వీరికి భిన్నంగా తనకు నచ్చిన అమ్మాయిని నేరుగా కలిసి, "నువ్వంటే నాకెంతో ఇష్టం- నువ్వు అంగీకరిస్తే పెళ్లి చేస్కుంటా", అని ఒక్క ముక్క చెప్పేస్తే, ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా ఉంటాయట. అయితే చెప్పే విధానంలో తేడా ఉంటే, పరిణామాలు చాలా తీవ్రంగా కూడా ఉండవచ్చంటున్నాడు.

కనుక ఆమెను నొప్పించని విధంగా మసలుకోవాలట. ఆమె ఇష్టపడితే.. లవ్ సక్సెస్. లేదంటే అక్కడితోనే స్టాప్. అంతేగానీ నచ్చిన అమ్మాయి కదా అని నెలల తరబడి ఫాలో చేసి, ఆనక ఆ అమ్మాయి "ఛీ" కొట్టిన తర్వాత బాధపడటం 'వేస్టు' బ్రదరూ అంటున్నాడు. ఈ బ్రదర్ చెప్పింది ఎంతవరకూ నిజమో...?
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT