ప్రేమ జోకులు | చిట్కాలు | మధుర జ్ఞాపకాలు | ప్రేమ కవితలు
ప్రధాన పేజి » ఇతరాలు » ప్రేమాయణం » చిట్కాలు » ప్రేయసి నా ముఖాన్ని కొంతకాలం చూపించవద్దంది. ఎందుకని..? (Love | Couple | Differences | Lover)
 
Love
WD
ప్రియురాలు అలా అంది కనుక దేవదాసులా మారిపోయి గడ్డాలు, మీసాలు పెంచుకుని నిత్యం ప్రియురాలితో గడిపిన పాత జ్ఞాపకాలనే నెమరువేసుకుంటూ, మధ్యమధ్యలో ఆమెను తిట్టుకుంటూ కూచోవడం చాలామంది చేసే పని. కానీ ప్రేయసి అలా ఎందుకు అన్నదో ఆమే స్వయంగా చెప్పేవరకూ అటువంటి దేవదాసు వేషాలు మాని కెరీర్, ప్రేయసితో భవిష్య జీవితం ఎలా ఉండాలన్న వాటిపై దృష్టి పెడితే ఫలితం ఉంటుంది.

సహజంగా ప్రియురాలు ప్రేమికుడిని ముఖం చూపవద్దనడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉండవచ్చు. అందులో మొదటిది తను ఎంతగానో ప్రేమించిన అబ్బాయి తనకు నచ్చని పనులు చేయడం. మరొకటి తన ఇంట్లో తల్లిదండ్రులతో ఆమెకు ఏవో సమస్యలు ఎదురవతూ ఉండటం. ఈ సమస్యల మధ్య ప్రేమికునితో సంతోషంగా ఉండాలంటే కుదరదు కనుక కొంతకాలం బ్రేక్ తీసుకుని సమస్యలు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత చూద్దామనే ధోరణి చాలామంది అమ్మాయిలలో ఉంటుంది.

కనుక ప్రేయసి ఏ విషయంలోనైనా.. నో చెప్పిన తర్వాత దాని వెనుక ఉన్న అసలు సంగతిని తవ్వి తీయాలన్న ధోరణి ఆమెను మరింత విసిగిస్తుంది. ఆమె కాస్త రిలాక్స్ అయిన తర్వాత స్వయంగా ఆమే అసలు విషయం చెప్పేస్తుంది. అలా జరుగక పోతే ఇరువురి మధ్య ఉన్న ప్రేమ బంధం కాస్త బలహీనంగా ఉన్నట్లే లెఖ్ఖ.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.