Romance | tips | touches | love | couple | ఈ "టచ్"లు మహా మత్తు గురూ...
WD
ఎక్కడెక్కడో ఎన్నిసార్లు స్పృశించినా మనసులో రేగిన భావాన్ని తనువు ద్వారా తెలియజేసేవి కొన్ని టచ్‌లు మాత్రమే. అటువంటివి 8 వరకూ ఉన్నాయంటున్నారు లవ్ టచింగ్స్‌పై శోధన చేసిన అధ్యయనకారులు.
ముఖ్యంగా మనసులో రొమాంటిక్ ఆలోచనలు కలిగినప్పుడు చేసే టచ్ విభిన్నంగా ఉంటుంది. ఆ స్పర్శలోని ఆనందం భాగస్వామి మనసుని రొమాంటిక్ మూడ్‌లోకి తెస్తుంది. దాంతో ఆమె/అతడి నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిస్పందన వస్తుంది. కపుల్స్‌ను రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకెళ్లే ఆ టచింగ్స్ ఏంటో చూద్దాం...
నుదుటిపై సుతారంగా చేసే పెదవుల స్పర్శ( ఇది ముద్దు కాదండోయ్.. ముద్దుకు ముందు ఉండే పరిస్థితి)
చేతిని ప్రేమగా ఒడిలోకి తీసుకోవడం
ముఖంపై ముంగురలను సరిచేస్తున్నట్లు సుతిమెత్తగా పెదవులను తాకడం
ముద్దు ముద్దు మాటలు చెపుతూ స్తనాగ్రాలపై చేతివేళ్లను తగిలించడం
మెడపై చేయివేసి తిన్నగా వీపు... అలా కిందివరకూ వెళ్లి.. ఆపై నడుము భాగపు మడతలను సుతిమెత్తగా స్పృశించడం
నడుముపై చేయి వేసి మాట్లాడుతూనే నాభిచుట్టూ సుతారంగా నిమరడం
కాళ్లూ.. కాళ్లూ రాస్తూ అప్పుడప్పుడు అవతలి కాలిపై ప్రేమపు ఒత్తిడిని పెంచడం
శరీరంలో కొన్ని భాగాలు మాత్రమే... అంటే భుజాలు, నడుము... వంటి భాగాలు తాకుతున్నట్లుగా కూచోవడం
ఇవి కేవలం శారీరక స్పర్శలే. వీటిని మించి ముద్దులు, బిగి కౌగిలింతలు ఉండనే ఉన్నాయి. అంటే ఇటువంటివన్నీ పై 8 స్పర్శా సుఖాలను రుచిచూశాక ప్రారంభమవుతాయి. ఇక ఆపై రొమాంటిక్ మూడ్ కే మూడుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ కపుల్స్‌కు తెలుసు. చెప్పఖ్ఖర్లేదు.
