Romantic songs | Girls | Love | Boys | రొమాంటిక్ సాంగ్ వినిపిస్తే అమ్మాయి ఫ్లాట్
WD
రొమాంటిక్ పాటలు అమ్మాయిల మనసులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయనే అంశంపై ఇటీవల ఓ అధ్యయన బృందం పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనలో భాగంగా 18 నుంచి 20 ఏళ్ల మధ్యగల 90 మంది అమ్మాయిలకు రొమాంటిక్ పాటలు వినిపించారు. ఈ పాటలను కూడా ఒక్కో అమ్మాయికి ఒక్కో అబ్బాయి చేత వినిపించారు.
అలా కొన్ని రోజులపాటు ఈ కార్యక్రమాన్ని సాగించారు. చివరికి రొమాంటిక్ సంగీతం వినిపించే అబ్బాయి కనపడకపోతే ఆ అమ్మాయిలు చెప్పలేని బాధను అనుభవించడాన్ని గమనించారు. ఈ విషయంపై అమ్మాయిల వద్ద ఆరా తీస్తే... సదరు అబ్బాయి లేనిదే కాలం చాలా భారంగా తోస్తోందనే సమాధానం ఇచ్చారట. కొంతమందైతే తమ మనసులను ఉల్లాసంలో తేలియాడించిన ఆ అబ్బాయే తమ బాయ్‌ఫ్రెండ్ అని ప్రకటించేశారట. రొమాంటిక్ సంగీతానికి ఎంత పవర్ ఉందో తెలుసుకున్నారుగా.
