1. ఇతరాలు
  2. »
  3. ప్రేమాయణం
  4. »
  5. చిట్కాలు

అమ్మాయిలను బుట్టలో పడేయాలా.. అయితే గిటార్‌తో వెళ్లండి!

గిటార్
FILE
అమ్మాయిలను బుట్టలో పడేయాలా.. అయితే గిటార్‌తో వెళ్లండి అంటున్నారు పరిశోధకులు. నచ్చిన అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకోవాలనుకుంటున్నారా... అయితే మాంచి డ్రస్ వేసుకుని చేతిలో గిటారు పట్టుకుని స్టైలిష్‌గా వెళ్లిపోండని యూనివర్శిటీ ఆఫ్ పారిస్ పరిశోధకులు అంటున్నారు. పారిస్ యూనివర్శిటీ పరిశోధకులు తాజాగా జరిపిన అధ్యయనంలో చేతిలో గిటార్ ఉన్న యువకులనే యువతులు ఎక్కువగా ఇష్టపడతారని వెల్లడైంది.

ఈ పరిశోధన కోసం పరిశోధకులు చూపులకు చక్కగా ఉన్న ఒక నవయవ్వనుడిని ఎంపిక చేశారు. 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయసున్న 300 మంది యువతుల దగ్గరుకు అతడిని మూడు అవతరాల్లో పంపించారు. ఒకసారి జిమ్ బ్యాగ్‌తో, ఒకసారి గిటార్‌తో, ఒక సారి ఖాళీ చేతులతో ఇలా మూడు రకాలుగా పంపించి చూశారు.

మొత్తానికి గిటార్ తో వెళ్లినప్పుడే ఎక్కువ మంది ఆ యువకుడిని చూడడం, మాట్లాడడం, నంబర్ ఇచ్చేయడం జరిగిపోయింది. మిగతా రెండు అవతారాల కంటే గిటార్‌తో వెళ్లినప్పుడు మంచిగా వర్కవుట్ అయిందని తెల్చారు. అదీ సంగతి!