తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మొదటి రోజైన శనివారం సాయంత్రం 3.30 నుంచి 5 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభమయ్యే ఈ బ్రహ్మోత్సవాలు వచ్చే 23వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.
ఈ ఉత్సవాల్లో పగలు, రాత్రి రెండు స్లారు వివిధ వాహనాలపై స్వామివారు నాలుగు మాడా వీధుల్లో ఊరేగి భక్తులకు కనువిందు చేస్తారు. ఇందుకోసం తితిదే పాలక మండలి అన్ని ఏర్పాట్లు చేసింది. మలయపెరుమాళ్ కొలువైన ఏడు గిరులను సర్వాంగసుందరంగా అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు భారీ స్థాయిలో పోలీసు బలగాలను మొహరించారు. ప్రధాన ద్వారం అలిపిరి గేటు మొదలుకొని, తిరుమలలోని ప్రతి అణువుపై పోలీసుల డేగకన్నులో ఉంది.
|