ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > శ్రీవారి బ్రహ్మోత్సవాలు
 
భక్తులకు వసతులను కల్పిస్తాం: తితిదే
శ్రీవారి బ్రహ్మోత్సావాల్లో పాల్గొనే భక్తులకు తగిన వసతులను కల్పించే చర్యలు తీసుకుంటామని తితిదే తెలపింది. దర్శనానికి అనంతరం భక్తులకు అత్యంత ముఖ్యమైన ఏర్పాట్లకు తమ విభాగం అన్నీ విధాల చర్యలు తీసుకుంటుందని తితిదే డిప్యూటీ ఈవో శ్రీనివాసులు చెప్పారు.

ఈ విషయమై తిరుమలలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున వినాయక చవితి పండుగ రావడంతో భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉందని చెప్పారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఇంతకంటే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని శ్రీనివాసులు అన్నారు. దీనికోసం మరింత పకడ్భందీగా వసతి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
మరిన్ని
సూర్యవాహనంలో ఊరేగిన వెంకయ్య
నేడు శ్రీవారికి సూర్య-చంద్ర వాహన సేవలు
గజవాహనంపై విహరించనున్న తిరుమలేశుడు
లక్షమంది భక్తుల తలనీలాల సమర్పణ
మాడవీధులలో మారుతిపై ఊరేగిన శ్రీవారు
నయనానందకరం... తిరుమలేశుని గరుడసేవ