ఆస్థానమండపంలో అలరించిన మాలతి సిస్టర్స్ కచేరి
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆస్థాన మండపంలో మాలతీ సిస్టర్స్ కచేరీ భక్తులను అలరించింది. గురువారం రాత్రి జరిగిన తిరుపతికి చెందిన జె.మాలతి, జె. శ్రీలత సిస్టర్స్ అన్నమయ్య, త్యాగరాజ సంకీర్తనలను ఆలపించి భక్తులను ఆధ్యాత్మిక చింతనలో పరవశింపజేశారు.
సంగీత ప్రియలును పెద్ద ఎత్తున ఆకట్టుకున్న ఈ కార్యక్రమంలో మృదంగం భాస్కర్, వయోలిన్ చక్రపాణి, తంబురతో శైలజ వ్యవహరించారు. ఈ కీర్తనల్లో భాగంగా "మరివేరే దిక్కెవరయ్యా రామా" వంటి సంకీర్తనలను ఆలపించారు. మాలతీ సిస్టర్స్ కచేరీకి అనంతరం ఎం.ఎస్. షీలా శాస్త్రీయ సంగీత కచేరీని నిర్వహించారు. ఈ కచేరీలో త్యాగరాజ కీర్తనలు, ముత్తుస్వామి కీర్తనలను ఆలపించారు.