శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర, తిరుమలేశుని ప్రభనలు కళ్లకు కట్టే విధంగా తిరుమల తితిదే ప్రత్యేక ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోంది. ఈ మ్యూజియంలో ఆళ్వారులు, తిరుమల అభివృద్ధికి పాటు పడిన రాజులు, గానయోగ్యమైన పాశురాలు వంటి తదితర అంశాలు చోటుచేసుకున్నాయి.
విష్ణుతత్త్వాన్ని కీర్తించి గానం చేసిన ఆళ్వారుల విగ్రహాలు, అన్నమయ్య కీర్తనలకు సంబంధించి ఒక రాగి రేకును మ్యూజియంలో సందర్శనార్థం తితిదే ఏర్పాటు చేసింది. తిరుమల దేవస్థాన అభివృద్ధికి పాటుపడిన భూపాలురకు సంబంధించిన వాయిద్య పరికరాలు, శిల్పాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి.
అంతేకాకుండా రాజులకాలంలో శ్రీ వేంకటేశ్వరునికి సమర్పించిన కానుకల వివరాలు మ్యూజియంలో భక్తులు దర్శించవచ్చునని తితిదే విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. తమిళ సాహిత్యంలో విశిష్టాద్వైత మతస్థాపనకు వ్యవస్థాపకమైన ఈ గ్రంథాలు మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారని తితిదే ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ మ్యూజియంలో మైసూరు మహారాజు సమర్పించిన దంతపు పల్లకి భక్తులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది.
|