'సూపర్ హిట్' టపాకాయలు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో హిట్టైన పలు చిత్రాల పేరుతో తయారైన ఫ్యాన్సీ టపాకాయలు మార్కెట్‌లో జోరుగా అమ్ముడుపోతున్నాయి. 'ధూమ్' చిత్రం పేరుతో తయారైన ఫ్యాన్సీ టపాసు ప్రత్యేక ఆకర్షణగావుంది. దీన్ని ఒక్కసారి వెలిగిస్తే చాలు.. యాభై నుంచి అరవై సార్లు గాలిలోకి దూసుకెళ్లి వింతవింత శబ్దాలతో మెరుపులు వెదజల్లడం దీని ప్రత్యేకత.
అంతేకాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా హిట్టైన ఆంగ్ల సినిమా 'లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్' పేరిట మార్కెట్‌లోకి వచ్చిన బాణాసంచా నగర వాసులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఒక్కసారి దీన్ని వెలిగించగానే గాల్లోకి వెళ్లే ఈ తారాజువ్వ 120 సార్లు రింగ్స్‌గా కనిపిస్తూ మెరుపులు మెరిపిస్తుంది.
ఎన్నెన్నో రకాలు.. వీటితో పాటు.. చైనా నుంచి ప్రత్యేకంగా దిగుపతి చేసుకున్న క్రాకలింగ్ బుల్లెట్, మిరాకిల్, సింగర్ షాట్‌లు ఉన్నాయి. అలాగే.. యోయో, రెయినీ స్టార్, రెడ్ ఫిల్టర్, మెరిండా గోల్డ్, ఏరియన్ ఫన్, గెలాక్సీ, గోల్డెన్ విల్లో, కలర్ మిర్చీ, స్కై స్టాపర్, హ్యాపీ ఫీట్, గ్రీన్ జిల్టర్, రాపవర్ వంటి రకాలు ఈ దీపావళికి ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. వీటితో పాటు.. స్వదేశీయంగా తయారైన బాణా సంచా విక్రయాలు కూడా జోరుగానే సాగుతున్నాయి.
|