గిరిజనుల ఇంట దీపావళి
|
మొదటిరోజు ఆవు పేడతో ఇంటిని అలుకుతారు. తర్వాత ఆవుపేడతో చేసిన ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. పండుగకు ముందుగానే ఇతర గ్రామాలలో నివసించే బంధువులకు ఆహ్వానం పంపుతారు. పండుగకు ముందు రోజు దైవప్రార్థనకు ఉద్దేశించిన సామాగ్రితోపాటు ఒక గుడ్డు, సజ్జ విత్తనాలు, మరియు టేకు గోళ్ళతో కూడిన బుట్టను ప్రతి కుటుంబానికి చెందిన సభ్యుడు గ్రామ పెద్దకు అందచేస్తారు.
|
ఊరిలోకి తిరిగి వచ్చే సమయంలో జ్యోతిని చేబూని ఊరంతా తిరుగుతూ "బెరియా బెరియా కురవ్" (ఈ జ్యోతి నిరంతరం వెలగాలి) అని నినాదాలు చేస్తారు. చివరగా గ్రామ పెద్ద ఇంటి ముందు అందరూ చేరి జ్యోతిని ఆర్పివేస్తారు. ఇక పండుగ రెండవ రోజు తమ ఆర్థిక స్తోమతను అనుసరించి అతిథులకు అన్నం, పప్పు మరియు హల్వాతో కూడిన విందుభోజనాన్ని పెడతారు. భోజనానంతరం డోలు మోగించి, బాణసంచా కాలుస్తారు.
|
పండుగ మూడవ రోజును పశువులను పూజించడానికి కేటాయిస్తారు. తెల్లావారు ఝూమునే కుటుంబ సభ్యులు నిద్రలేచి ఎద్దుల కొమ్ములను కడిగి పాలు, 'గేరు' మిశ్రమంతో కొమ్ములకు ఎరుపు రంగును అద్దుతారు. అనంతరం కుటుంబ పెద్దతోపాటు మరో ముగ్గురు సభ్యులు 'టగరీ' (ఇనుప పాత్ర)లో బాజ్రా ఛఫ్‌ను పశుగణానికి నివేదించి, వెండి నాణేలు మరియు ఆభరణాలతో వాటి పాదాలకు నమస్కరిస్తారు.
ఆ రోజు పశువులకు ఎలాంటి పనిని అప్పగించరు. అలంకరించబడిన ఎద్దులను గ్రామంలో జరిగే ఎద్దుల పందాలలో పాల్గొంటాయి. తమ పశుసంపదను చల్లగా చూడమని కోరుతూ బంకమట్టితో చేసిన లోటా, గుఱ్ఱాన్ని 'గుహ బాబా'కు సమర్పించుకుంటారు. ఇక తమకు అనుకూలమైన కాలంలో దీపావళి పండుగను జరుపుకునేందుకు గాను 10-15 గ్రామాలకు చెందిన పెద్దలు సమావేశమై ఒక తేదీని నిర్ణయిస్తారు.
