ప్రధాన పేజి   ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > స్వాతంత్ర్య దినోత్సవం
 
రాజకీయాలలో యువతకు పెద్ద పీట వేయాలి
చారిత్రాత్మకమైన 60వ స్వాతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకోబోతున్నప్పటకి, దేశంలోని అనేక ప్రాంతలు మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. నేటికి గ్రామీణ ప్రాంతలలో కనీస అవసరాలైన వసతి, విద్య, వైద్య సౌకర్యాలు అందకపోవటానికి బలీయమైన కారణం ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలేననీ, ఈ పరిమాణల దృష్ట్యా మరో స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలకవలసిన అవసరం ఎంతైనా ఉందని లోక్‌సత్తా పార్టీ జాతీయ సమన్వయ కర్త డా|| జయప్రకాశ్ నారాయణ్ అంటున్నారు.

ప్రజాసేవకు దగ్గర అవ్వాలనే ఆకాంక్షతో వైద్యునిగా తన జీవితాన్ని ప్రారంభించి కలెక్టరుగా బాధ్యతలు చేపట్టి, ప్రజాసేవ చేయాలనే దృక్పధంతో లోక్‌సత్తా పార్టీ స్థాపనకు సూత్రదారి అయ్యారు జయప్రకాశ్ నారాయణ్.

ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా, కంకిపాడు సమీపంలో మైనర్ పంచాయితీగా వున్న పుదిపాడు గ్రామంలో బాల్యజీవితాన్ని గడిపిన జయప్రకాష్ నారాయణ్ వృత్తిరీత్య డాక్టరుగా కొంత కాలం పని చేసినప్పటికీ సంతృప్తి చెందని ఆయన ప్రజలకు మరింత చేరువ కావలనే కోరికతో 1980లో ఇండియన్ అడ్మినీస్ట్రేటివ్ సర్వీస్ (I.A.S.)కి ఎంపికైయ్యారు.

కలెక్టరుగా బాధ్యతలు నిర్వహించటంతోపాటు, ముఖ్యమంత్రి, గవర్నర్‌లకు సెక్రెటరీగా వివిధ శాఖలలో 17 సంవత్సరాలపాటు పని చేసిన ఆయన 1996లో పదవికి రాజీనామా చేసి లోక్‌సత్తా పార్టీ స్థాపించారు. 60 వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా శ్రీ జయప్రకాష్ నారాయణ్‌ను వెబ్‌దునియా తెలుగు ప్రత్యేక ఇంటర్యూ చేసింది. ఆ విశేషాలు మీకోసం...

వెబ్‌దునియా: స్వాతంత్రం వచ్చి 60 ఏళ్లు అయింది. ఈ నేపథ్యంలో మన దేశం ఇంకా అభివృద్ది చెందుతున్న దేశంగానే వుండటానికి కారణాలేమిటి?
జె.పి: ఈ ప్రశ్నకు సంబంధించి ప్రస్తుతం వున్న రాజకీయాలే ఇందుకు కారణాలని చెప్పాలి. 75 శాతం రాజకీయాలు కలుషితమైనవని మనకి అర్థమౌతుంది. నేటి రాజకీయ నాయకులు రాజకీయ రంగాన్ని సామాజిక బాధ్యతగా కాక ఓ వ్యాపార రంగంగా చూస్తున్నారు. దీని వలన ప్రజలకు అవసరమైన అబివృకద్ది విషయంలో కొంత దూరమవుతున్నాం.

అభివృద్ధి చెందుతున్న దేశంగానే పాఠ్యపుస్తకాలలో మేము చదివాం. తరువాతి తరం వాళ్ళు చదివారు. ఇక ముందు బావితరాలు మాత్రం భారత దేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా చదవాలనే ఉద్దేశంతోనే లోక్‌సత్తా పార్టీ ముందుకు వెళుతుంది. అయినప్పటికీ దేశం పూర్తిగా వెనుకబడి లేదు. కొన్ని కొన్ని దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ, ఫార్మా తదితర రంగాలలో ముందున్నదనే చెప్పాలి.
1| 2
మరిన్ని
60 ఏళ్ల స్వాతంత్ర్యానికి ముందు వెనుకలు
తొలి స్వాతంత్ర్య పోరాటానికి నాంది పలికి రోజు
భారత స్వాతంత్ర్యోద్యమంలో నెత్తుటి మరకలు
ఝాన్సీరాణి చివరి మాట... జై హింద్!
భారత కీర్తిని ఇనుమడింపజేసిన సానియా
దేశం గర్వించదగ్గ మహిళా ఐపీఎస్ అధికారిణి