స్త్రీలు ఆరోగ్యంగా ఉండేందుకు వైద్యులు పలు సూచనలు చేస్తుంటారు. అందునా వారు గర్భావస్థలోనున్నప్పుడైతే మరీనూ... నిజమైన శరీర ఫిట్‌నెస్ ప్రోగ్రాంను పాటిస్తే గర్భిణీ స్త్రీలకు ఎంతో లాభదాయకం అంటున్నారు వైద్యులు. ఈ ప్రోగ్రాం ప్రత్యేక మహిళకు వారి వారి ఆరోగ్యాన్ననుసరించి, వారి మెడికల్ హిస్టరీకి అనుగుణంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికిగాను గర్భిణీ స్త్రీలు ఇలాంటి ప్రోగ్రాంలు చేసేముందు వారి ఫిజీషియన్‌ల సలహాలను తీసుకుని పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. గర్భావస్థలోనున్నప్పుడు వ్యాయామం ఎందుకు చేయాలి?** గర్భిణీ స్త్రీలు తమలో ఉత్సాహాన్ని నింపేందుకుగాను వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ** వారి శరీరంలోని వివిధ భాగాలన్నీకూడా పటిష్టంగా ఉండేందుకు వ్యాయామం తప్పనిసరని వైద్యులు అంటున్నారు. ** వ్యాయామం చేస్తే ముఖ్యంగా ఆ సమయంలో వచ్చే నడుము నొప్పిని నివారించేందుకు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఇంకా ఇతర శారీరక రోగాలబారిన పడకుండా ఉండేందుకు వ్యాయామం తప్పనిసరి అంటున్నారు వైద్యులు.**ప్రసవం అయిన తర్వాత మానసికమైన, శారీరక ఒత్తిడులను దూరం చేసేందుకు వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడంతో తమ శిశువును తామే చక్కగా పెంచుకునే వీలు కలుగుతుంది. ** గర్భిణీ స్త్రీలు తమ శరీరంలో శక్తిని పెంపొందించుకోవడానికి వ్యాయామం తప్పనిసరి అంటున్నారు వైద్యులు. గర్భావస్థలోనున్నప్పుడు చేసే వ్యాయామం కారణంగా శిశువుకు లాభదాయకమేనా?గర్భావస్థలోనున్నప్పుడు తమ శరీరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే తేలికపాటి వ్యాయామం చేస్తే అటు గర్భిణీ స్త్రీకి అలాగే శిశువుకుకూడా లాభదాయకం అంటున్నారు వైద్యులు. గర్భిణీ స్త్రీకి ఫిజియోథెరపి ప్రోగ్రామ్ ఏ మేరకు ఉపయోగపడుతుంది? ** గర్భావస్థలోనున్నప్పుడు తొలి మూడు నెలల్లో చేసే వ్యాయామం కారణంగా శిశువు శరీరానికి రక్తప్రసరణ, ప్రాణవాయువు సమృద్ధిగా లభిస్తుంది. దీంతో గర్భావస్థలో వచ్చే నడుము నొప్పినుంచి తమను తాము కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం చేయడం కారణంగా ప్రసవం సాఫీగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. |