When Ur Pregnant go for physiotherapy | గర్భావస్థలో ఫిజియోథెరపీ...!
సరైన ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ చేయండి...ప్రసవం శుఖవంతమౌతుంది
స్త్రీలు ఆరోగ్యంగా ఉండేందుకు వైద్యులు పలు సూచనలు చేస్తుంటారు. అందునా వారు గర్భావస్థలోనున్నప్పుడైతే మరీనూ... నిజమైన శరీర ఫిట్‌నెస్ ప్రోగ్రాంను పాటిస్తే గర్భిణీ స్త్రీలకు ఎంతో లాభదాయకం అంటున్నారు వైద్యులు. ఈ ప్రోగ్రాం ప్రత్యేక మహిళకు వారి వారి ఆరోగ్యాన్ననుసరించి, వారి మెడికల్ హిస్టరీకి అనుగుణంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికిగాను గర్భిణీ స్త్రీలు ఇలాంటి ప్రోగ్రాంలు చేసేముందు వారి ఫిజీషియన్‌ల సలహాలను తీసుకుని పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
గర్భావస్థలోనున్నప్పుడు వ్యాయామం ఎందుకు చేయాలి?
** గర్భిణీ స్త్రీలు తమలో ఉత్సాహాన్ని నింపేందుకుగాను వ్యాయామం చేయాల్సి ఉంటుంది.
** వారి శరీరంలోని వివిధ భాగాలన్నీకూడా పటిష్టంగా ఉండేందుకు వ్యాయామం తప్పనిసరని వైద్యులు అంటున్నారు.
** వ్యాయామం చేస్తే ముఖ్యంగా ఆ సమయంలో వచ్చే నడుము నొప్పిని నివారించేందుకు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఇంకా ఇతర శారీరక రోగాలబారిన పడకుండా ఉండేందుకు వ్యాయామం తప్పనిసరి అంటున్నారు వైద్యులు.
**ప్రసవం అయిన తర్వాత మానసికమైన, శారీరక ఒత్తిడులను దూరం చేసేందుకు వ్యాయామం చేయాలి.
వ్యాయామం చేయడంతో తమ శిశువును తామే చక్కగా పెంచుకునే వీలు కలుగుతుంది.
** గర్భిణీ స్త్రీలు తమ శరీరంలో శక్తిని పెంపొందించుకోవడానికి వ్యాయామం తప్పనిసరి అంటున్నారు వైద్యులు.
గర్భావస్థలోనున్నప్పుడు చేసే వ్యాయామం కారణంగా శిశువుకు లాభదాయకమేనా?
గర్భావస్థలోనున్నప్పుడు తమ శరీరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే తేలికపాటి వ్యాయామం చేస్తే అటు గర్భిణీ స్త్రీకి అలాగే శిశువుకుకూడా లాభదాయకం అంటున్నారు వైద్యులు.
గర్భిణీ స్త్రీకి ఫిజియోథెరపి ప్రోగ్రామ్ ఏ మేరకు ఉపయోగపడుతుంది?
** గర్భావస్థలోనున్నప్పుడు తొలి మూడు నెలల్లో చేసే వ్యాయామం కారణంగా శిశువు శరీరానికి రక్తప్రసరణ, ప్రాణవాయువు సమృద్ధిగా లభిస్తుంది. దీంతో గర్భావస్థలో వచ్చే నడుము నొప్పినుంచి తమను తాము కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం చేయడం కారణంగా ప్రసవం సాఫీగా జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
** మరుసటి మూడు నెలల్లో చేసే ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ వలన గర్భిణీ స్త్రీలలో శారీరక శక్తి పెరుగుతుంది. రాత్రిపూట సుఖవంతమైన నిద్రకూడా వస్తుంది. దీంతో శరీరంలో కొవ్వు శాతం పెరగకుండా నిరోధిస్తుంది, దీంతోబాటు ప్రసవానంతరం శరీర బరువు పెరగకుండా నిరోధిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
** చివరి మూడు నెలల్లో చేసే వ్యాయామం గర్భిణీ స్త్రీకి ప్రసవానికి సిద్ధం చేసేదిగా ఉంటుంది. ప్రసవానంతరం శరీరంలో వచ్చే మార్పులు, బాధనుంచి కాపాడుకోవడానికి వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
గర్భావస్థలోనున్నప్పుడు క్రిందపేర్కొనబడిన ప్రభావం, మార్పులు కనపడితే వెంటనే మీరు చేసే వ్యాయామం నిలిపేసి ఫిజీషియన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు వైద్యులు.
రక్తస్రావం
కళ్లు తిరగడం
అధిక రక్తపోటు
బలహీనంగా ఉండటం
కడుపులో శిశువు కదలికల్లో మార్పులు
కీళ్ళనొప్పులులాంటివి ఉంటే వెంటనే వైద్యుల సలహాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ముఖ్యంగా గర్భావస్థలోనున్నప్పుడు స్త్రీలు వ్యాయామం చేసేటప్పుడు అలసటకు దారితీసే వ్యాయామాలు చేయకూడదు. అలసట వచ్చేముందే వ్యాయామాన్ని నిలిపేయండి. వారానికి కేవలం మూడు గంటలు మాత్రమే వ్యాయామం చేస్తే గర్భావస్థలోనున్నప్పుడు, ప్రసవమైన తర్వాత ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు. సరైన ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ చేసి తొమ్మిది నెలలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నించండంటున్నారు ఆరోగ్యనిపుణులు.

|