1. ఇతరాలు
  2. »
  3. మహిళ
  4. »
  5. కథనాలు
  6. Women

Life time | Women | Britan | Beautician | survey | జీవితకాలంలో అలంకారం కోసం రూ.75 లక్షలు ఖర్చు!

జీవితకాలం
File
FILE
ఒక మహిళ తన జీవిత కాలంలో తన అలంకారం కోసం అక్షరాలా 75 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. ఇంత భారీ మొత్తంలో అలంకారం కోసం ఖర్చు చేసే మహిళల జాబితాలో బ్రిటన్ సుందరీమణులు మొదటి స్థానంలో ఉన్నట్టు బియన్‌సెన్ అనే డియోడరెంట్ సంస్థ నిర్వహించిన తాజా పరిశోధనలో తేలింది.

ఒక బ్రిటిష్‌ మహిళ తమ యౌవ్వన కాలంలో యేటా 2000 పౌండ్లు లేదా వారానికి 40 పౌండ్లు సగటున ఖర్చు చేస్తుందట. 57 శాతం మహిళలు మేకప్‌ లేకుండా తమ జీవిత భాగస్వాములతో బయటకు వెళ్ళటాని కంటే మేకప్‌ కోసం వారికి ఏదో ఒకటి చెప్పి మోసం చేస్తున్నట్టు ఈ సర్వేలో తేలింది.

ఇందుకోసం డియోడరెంట్ సంస్థ 2200 మంది మహిళల వద్ద వారి అభిప్రాయాలను సేకరించింది. వీరిలో రెండొంతుల మంది పాత అలంకరణ సామాగ్రి స్థానంలో కొత్త వాటి కోసం 550 పౌండ్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పగా, ప్రతీ పది మందిలో ఒకరు ఆ ఖర్చు 700 పౌండ్లుగా వెచ్చిస్తున్నట్టు తెలిపారు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి