ఇంట్లో శుఖ సంతోషాలు వెల్లివిరియాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంటారు. ముఖ్యంగా ఇంట్లోని స్టోర్ రూం ఇంటికి ఏ వైపువుందో చూసుకోండి. అది ఉత్తరం, ఉత్తర ఈశాన్యం మధ్య భాగంలో ఉండేలా ఏర్పాటు చేసుకోండి.
తూర్పు లేదా ఆగ్నేయ కోణం మధ్యలో లేదా దక్షిణ భాగంలోని ఆగ్నేయ కోణంలో నిర్మిస్తే గృహ యజమాని శుఖంగా ఉండటంతో ఇంట్లోని మిగిలిన కుటుంబ సభ్యులు కూడా శుఖంగానే ఉంటారు. అలాగే ఇంట్లో ఎలాంటి కష్టనష్టాలుండవు.
ఇంట్లోని ముందు భాగంలో ఖాళీ స్థలం ఉండేలా చూసుకోండి. దీంతో గృహ యజమాని ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది. ఏ ఇంట్లోనైతే ప్రకృతిపరమైన గాలి వెలుతురు, సూర్యకిరణాలు ప్రసరిస్తుంటాయో ఆ ఇంట్లో నివసించే ప్రతి ఒక్కరు శుఖంగా జీవితాన్ని గడుపుతారనడంలో సందేహం లేదు.
ఒకవేళ ఇంట్లోని డ్రాయింగ్ రూంలోనే కూర్చొని భోజనం చేయాలనుకుంటే మీరు వేసుకునే డైనింగ్ టేబుల్‌ను దక్షిణ-తూర్పు దిక్కులో ఉంచండి. అంటే ఆగ్నేయ భాగంలో ఉంచండి. వేరొక డైనింగ్ హాలు తూర్పు లేదా పశ్చిమ దిక్కులో ఉండేలా నిర్మించండి.